చాక్లెట్‌ వస్తువు కాదు! కమిట్‌మెంట్‌

9 Feb, 2020 11:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాలెంటైన్‌ వీక్‌లోని మూడోరోజు, ప్రపోజ్‌ డే తర్వాతి రోజు ‘చాక్లెట్‌ డే’.. ప్రియమైన వారితో తీపిని పంచుకోవటం అన్నది చాలా ప్రత్యేకమైనది. దానర్థం మరిన్ని మధురమైన క్షణాలను నీ కందిస్తానని ఎదుటివ్యక్తికి భరోసా ఇవ్వటమే. చాక్లెట్‌ అంటే తినే వస్తువు మాత్రమే కాదు! ప్రేమకు గుర్తు కూడా. ఇది ఒకరిపై ఒకరి ఉండాల్సిన కమిట్‌మెంట్‌ను తెలియజేస్తుంది. చాక్లెట్‌ డేను జరుపుకోవటానికి ఇది కూడా ఓ ప్రధానమైన కారణం.


చాక్లెట్లు.. హెల్త్‌ బెనిఫిట్స్‌ 
చాక్లెట్లంటే అంటే చాలా మందికి ఇష్టం. రోజుకో చాక్లెట్‌ చొప్పున తినటం అన్నది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మన గుండెను భద్రంగా ఉంచుతుంది. మన మూడ్‌ను సెట్‌ అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా చాక్లెట్‌ తినటం అన్నది సూథింగ్‌ థెరపీలాగా పనిచేసి బొంగురు పోయిన గొంతును బాగుపరచటంలో తోడ్పడుతుంది. మన మెదడును చురుకుగా పనిచేసేలా చేసి, సంరక్షిస్తుంది. చాక్లెట్‌లో రకాలను బట్టి అవి చేసే మేలులో కూడా తేడాలు ఉంటాయి. డార్క్‌ చాక్లెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలా పరిశోధనల్లో తేలింది. అందుకే మన బంధాన్ని మరింత తియ్యగా, కొండంత బలంగా ఉంచుకోవాలంటే బోలెడన్ని డార్క్‌ చాక్లెట్లు మీ భాగస్వామికి గిఫ్ట్‌ ఇవ్వండి.

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు