అందుకే క్రిస్మస్‌ ట్రీకి వీటిని వేలాడదీస్తారు!

24 Dec, 2019 12:46 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా జరిగే ముఖ్యమైన పండుగలలో ముందు వరుసలో నిలిచేది క్రిస్మస్‌. ప్రపంచంలోని పలు దేశాల్లో పలు క్రిస్మస్‌ ఆచారాలు ఉన్నాయి. అందులో కొన్ని ఎప్పుడో పురతాన కాలంలో ప్రారంభం కాగా, మరికొన్ని నూతనంగా ప్రవేశించాయి. ఈ క్రిస్మస్‌కు వారు ఎలాంటి ఆచారాలు పాటిస్తారో అవి ఎలా పుట్టుకొచ్చాయో తెలుసుకుందాం రండి.

క్రిస్మస్‌ ట్రీకి ఎందుకు ‘షూ’ బోమ్మలను ఉంచుతారో తెలుసా.. 
క్రిస్మస్‌ చెట్టుకు క్రిస్మస్‌ తాత ‘షూ’ను వేలాడదీసి కట్టడం మీరు చూసే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్‌ పండుగకు టపాసులు కాలుస్తారు. కానీ కేవలం పిల్లలు మాత్రమే ఈ టపాసులను కాలుస్తారు. ఓ నిరుపే దవ్యక్తి‍కి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే  క్రిస్మస్‌ రాగానే వారు తమ తండ్రి టపాసులు కావాలని అడిగారు. అయితే ఆ తండ్రి ఇప్పడు వద్దమ్మా తరువాత కొనిస్తాను అని చెప్పాడు. చుట్టుపక్కల పిల్లలు టపాసులు కాల్చడం చూసి తమకూ కావాలని వారు పట్టుబట్టారు. కానీ తండ్రి వద్ద కొనడానికి డబ్బులే లేవు. ఎలాగైనా సరే అవి మాకు తెచ్చి పెట్టు అంటూ పిల్లులు మారాం చేశారు. అలా ఏడుస్తున్న పిల్లలు టపాసుల శబ్థం వచ్చి బయటికి వచ్చి చుశారు. అక్కడ వారి ఇంటి ముందు  ‘షూ’లో బోలేడన్ని బహుమతులు, టపాసులు పెట్టి ఉండటం వారు గమనించారు.

ఇవి ఎవరు తెచ్చారా అని చుట్టూ చూసిన వారు ఎరుపు రంగు ఉలను టోపి, అదే రంగులో ఉన్ని కోటును ధరించి చేతి కర్రతో వెలుతున్న ఓ ముసలి వ్యక్తిని చూశారు. అలా చూస్తూ ఉండగానే ఆయన మంచులో మాయమైపోయాడు. ఆ తర్వాత వారు ఇంటి లోపలికి వెళ్లి వాళ్ల​ నాన్నతో క్రిస్మస్‌ తాత వచ్చి మాకు టపాసులు ఇచ్చాడంటూ సంబర పడిపోయారు. అలా అప్పటీ నుంచి ప్రతి క్రిస్మస్‌కు  పిల్లలందరూ క్రిస్మస్‌ చెట్లకు, ఇంటి ముందు ‘షూ’ను వెలాదీసీ ఉంచడం మొదలు పెట్టారు. ఎందుకంటే క్రిస్మస్‌ తాత వచ్చి వాటిలో క్రిస్మస్‌ బహుమతులు, టపాసులు పెట్టి వెడతాడని వారి నమ్మకం. రాను రానూ క్రిస్మస్‌ ట్రీకి ‘షూ’ను వేలాడదీయడం ఆనవాయితీగా మారింది.

జర్మనీ రాజు తెచ్చిన గ్రీటింగ్‌ కార్డులు: 
1843లో ఇంగ్లాండు దేశానికి చెందిన సర్‌ హెన్నీ కోల్‌ తన బంధు మిత్రులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు వినూత్న రీతిలో తెలపాలని అనుకున్నాడు. వెంటనే కొన్ని కార్డులను తయారు చేసి దాని మీద క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రాయించాడు. వాటిని తన మిత్రులకు పంపడంతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. కార్డులు ఒక్కసారి ఇస్తే అవి జీవితాంతం దాచుకుంటారు. అనుకోని సంఘటనలు ఎదురైతే తప్ప వాటిని కోల్పోరు కదా. అందుకే ఈ గ్రీటింగ్‌ కార్డులు ఇస్తే అవి ఎప్పటికీ తీపి గుర్తులుగా ఉండిపోతాయి.. ఇది మంచి ఆలోచన.

ఎప్పటికీ ఎండిపోని ఫిర్‌ చెట్టు(క్రిస్మస్‌ ట్రీ)..
క్రిస్మస్‌ చెట్టు ఆచారం జర్మనీ నుంచి పుట్టుకొచ్చింది. సాధారణంగా ఫిర్‌ చెట్టును క్రిస్మస్‌ చెట్టుగా అలంకరిస్తారు. ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది అన్ని కాలాల్లోనూ ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది.అలాగే మన జీవితాల్లో కూడా దేవుని దీవెనలను అలాగే ఉండాలన్న ఆలోచనలతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. 1846లో విక్టోరియా రాణి, జర్మనీ రాకుమారుడు అల్బర్ట్‌ను కలసి అలంకరించిన క్రిస్మస్‌ ట్రీ పక్కన నిలుచుని ఫొటో దిగారు. అతి అన్ని వార్తాపత్రికలలో ప్రచురితం కావడంతో క్రిస్మస్‌ ట్రీ డిమాండ్‌ పెరిగింది. అనంతరం జర్మన్‌ ప్రజలు అమెరికాలో స్థిరపడటం వల్ల అమెరికాలో కూడా ఈ ఆచారం వాడుకలోకి వచ్చింది.

చైనాలో అతిపెద్ద క్రిస్మస్‌ సిజన్‌ షాపింగ్‌ : 
క్రిస్మస్‌ సీజన్‌లో చైనాలో అత్యధిక కొనుగోళ్లు జరుగుతాయి. ఆ దేశంలో జరిగే అతి పెద్ద షాపింగ్‌ సీజన్‌ క్రిస్మస్‌ ముందు రోజే. క్రిస్మస్‌ ఆచారాల్లో అక్కడక్కడా కనిపించే యాపిల్‌ పండ్ల ఆచారం చైనా నుంచే వచ్చింది. మండారిన్‌ భాషలో యాపిల్‌ పండు ఉపయోగించే పదరం క్రిస్మస్‌ ఈవ్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడ యాపిల్‌తో చేసిన అలంకరణలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది.

ముందు రోజు ఉపవాసం:
క్రిస్మస్‌ ముందు రోజైన డిసెంబర్‌ 24న రష్యన్‌ ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. సాధారణంగా సూర్యుడు వెళ్లిపోయి చుక్కలు కనిపించినప్పుడు మాత్రమే ఆహారాన్ని భుజిస్తారు. అయితే మాంసం మాత్రం ముట్టుకోరు. కుత్యా అనే వంటకం అక్కడ ఫేమస్‌. ఆ వంటకంలో వివిధ రకాలైన ధాన్యాలు, తెనె, వంటి విత్తనాలు వేసి తయారు చేస్తారు. అయితే ఉపవాసం విరమించేటప్పుడు బోధకులు వారి ఇళ్లకు వెళ్లి వాటిపై పవిత్ర జలం చల్లి ప్రార్థనలు చేసిన తర్వాతే దానిని స్వీకరిస్తారు.

- స్నేహలత (వెబ్ డెస్క్)

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు