రొమాన్స్‌ అంటే ఇదే!

13 Oct, 2019 12:41 IST|Sakshi

రొమాన్స్‌ అంటే ఏమిటో తెలియని చాలా మందికి ఇదో బూతు పదంలా అనిపిస్తుంది. కానీ, తెలుసుకుంటే మాత్రం బంధాలను కలకాలం నిలిపే ఓ దివ్య ఔషదంలా పనిచేస్తుంది. రొమాన్స్‌ ప్రేమికులు, భార్యాభర్తల జీవితాలలో సంతోషాలను రెట్టింపు చేసే చక్కని మార్గం. వ్యక్తుల ఆలోచనల్లో తేడాలు ఉన్నట్లే రోమాన్స్‌ తాలూకా అనుభవాలలో కూడా తేడాలు ఉంటాయి. అయితే రొమాన్స్‌ అంటే ఇది అని మాత్రం ప్రత్యేకంగా చెప్పలేము. 

రొమాన్స్‌ :
 ‘‘ రొమాన్స్‌ అనేది లైంగిక వాంఛలకు సంబంధించినది కాదు. అయినప్పటికి హృదయాన్ని తట్టి లేపుతుంది’’   
                                                    రాచెల్‌ హాక్స్‌.. ప్రఖ్యాత రొమాంటిక్‌ నవలల రచయిత

ఎదుటి వ్యక్తిని మనం ఎంత ప్రేమిస్తున్నామో తెలియజేసే సున్నితమైన పద్దతే రొమాన్స్‌. నా ప్రపంచం నువ్వే అని భాగస్వామికి తెలియజేయటం. ఇది జంటల మధ్య బంధాన్ని ప్రతి క్షణం కొత్తగా, అందంగా మలుస్తుంది! చెరిగిపోని జ్ఞాపకాలను మిగులుస్తుంది.  మానసికంగా, శారీరకంగా ఎదుటివ్యక్తిని సంతోష పరచటం జరుగుంది. ప్రేమగా మాట్లాడటం, కళ్లలోకి కళ్లు పెట్టి చూడటం, ఓ చిరునవ్వు, పొగడ్త, వేళ్లతో జుట్టును నిమరటం, కౌగిలించుకోవటం ఇలా భాగస్వామిని సంతోషపెట్టే ప్రతి పని రొమాన్స్‌ అని చెప్పొచు​.

ఇది ఆడ,మగలకు వేరుగా, ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన చేష్టలతో తమ ప్రేమను వ్యక్తపరచటం జరుగుతుంది. ఎదుటి వ్యక్తుల కోర్కెలకు, అనుభూతులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.  రొమాన్స్‌లో సెక్స్‌కు తావు లేదు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు