బరువు తగ్గడం‌: ఇవన్నీ అపోహలే

7 Jun, 2020 12:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో ప్రాచూర్యం పొందిన చిట్కాలనో, డైట్‌ ప్లాన్‌లనో పాటించే ఉంటాము. యూట్యూబ్‌లో చూసిన దాన్నో.. ఇంటర్‌నెట్‌లో చదివిన దాన్నో.. స్నేహితుడు చెప్పినదాన్నో అచరించే ఉంటాము. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గటం కోసం ప్రాచూర్యం పొందిన ప్రతీ చిట్కాను, డైట్‌ ప్లాన్‌ను ఫాలో అయిపోతుంటారు. నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారు, రాత్రి పూట తిండి తినడం మానేస్తే బరువు తగ్గుతారు ఇలా ఏదో ఒక  దాన్ని ఆచరణలో పెట్టి ఫలితం రాక ఢీలా పడిపోతుంటారు. అయితే ఇప్పటికి చాలా మంది కొన్ని డైటింగ్‌ విధానాలపై అపోహలతో ఉన్నారు. ఆ డైటింగ్‌ విధానాల ద్వారా బరువు తగ్గే అవకాశం ఉందనే భ్రమలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం ప్రాచూర్యం పొందిన డైట్‌ ప్లాన్‌లలో 90శాతానికిపైగా అపోహలే.

డైట్‌ ప్లాన్‌ అపోహల్లో కొన్ని..

1) గ్రీన్‌ టీ
గ్రీన్‌ టీ ఒక జీరో క్యాలరీ డ్రింక్‌. ఇందులో ఫ్లేవనాయిడ్స్‌ తగిన మోతాదులో ఉంటాయి. అయితే గ్రీన్‌ టీ తాగటం వల్ల బరువు తగ్గుతారన్నది అపోహ మాత్రమే.

2) తేనె, నిమ్మరసం
తేనె, నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని, పరగడపున తాగితే బరువు తగ్గుతారన్నది కూడా అపోహే. ఈ పానీయాన్ని ఉదయం లేవగానే తాగటం వల్ల కొవ్వు కణాలను కరిగిస్తుందన్నది అబద్ధం.

3) చెమట ఎంత ఎక్కువగా పడితే అంత కొవ్వు కరుగుతుంది?
చెమట ఎంత ఎక్కువగా పడితే అంత కొవ్వు కరుగుతుందన్నది కూడా శుద్ధ అబద్ధం. జిమ్‌ ట్రైనర్స్‌ చెప్పే కొన్ని విషయాల్లో వాస్తవాలు ఉండవు. మీరు జిమ్‌లో బరువు తగ్గాలనుకుంటే కార్డియోను, వెయిట్‌ ట్రైనింగ్‌‌, కోర్‌ స్ట్రెన్తనింగ్‌తో బ్యాలన్స్‌ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 

4) కార్డియో 
కార్డియో ద్వారా బరువు తగ్గుతారన్నది కూడా అపోహే. మీరు కార్డియో చేస్తున్నపుడు క్యాలరీలు ఖర్చవుతాయి. కానీ, కార్డియో తర్వాత మీరు ఖర్చుచేసే క్యాలరీల సంఖ్య జీరో. అందువ‍ల్ల మనం ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం అన్న దానిపై శ్రద్ధ వహించాలి. కొత్తగా కొవ్వు ఒంట్లో చేరకుండా చూసుకోవాలి.

మరిన్ని వార్తలు