వాడికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు!

25 Dec, 2019 14:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేను డిగ్రీ చదివేటప్పుడు ఆన్‌లైన్‌లో ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయితో డీప్‌ లవ్‌లో ఉన్నాను. అతడిని పెళ్లి చేసుకుంటానంటే మా వాళ్లు వాళ్ల ఇంటికి వెళ్లారు. అప్పుడు తెలిసింది! వాడికి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని. అక్కడ వీడియో తీసి ఇంటికి వచ్చాక నాకు చూపించారు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఇంట్లో ఉండలేక ఎంబీఏ స్టార్ట్‌ చేశాను. అక్కడ రవి అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. అతను నాకు ప్రపోజ్‌ చేసినా నేను ఒప్పుకోలేదు. తర్వాత తన పట్టుదల నచ్చి ఒప్పుకున్నాను. అప్పటికే లవ్‌ ఫెయిల్యూర్‌ అయిన నేను మరో సారి ప్రేమంటే భయం వేసింది. కానీ, ఈ అబ్బాయి నన్ను నేరుగా వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ల అమ్మానాన్నలకు పరిచయం చేశాడు.

డైలీ సీక్రెట్‌గా మాట్లాడుకునేవాళ్లం. మా అమ్మానాన్న రవితో నా పెళ్లికి ఒప్పుకుంటారనే నమ్మకం లేదు. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నాం. ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత ఎవరి ఇంటికి వాళ్లం వెళ్లిపోయాం. అలా ఓ నెలరోజులు గడిచిపోయాయి. డైలీ కాలేజ్లో కలిసేవాళ్లం. కానీ, రోజూలానే మామూలుగా ప్రవర్తించేవాళ్లం. ఓ రోజు మా అమ్మానాన్న నాకు మా మామయ్య వాళ్ల అబ్బాయితో పెళ్లి చేయటానికి మాట్లాడుకోవటం నేను విన్నాను. చాలా భయం వేసింది. మార్నింగ్‌ కాలేజ్‌కు వెళ్లి రవికి విషయం చెప్పేశాను.

వెంటనే నేను మా నాన్నకు ఫోన్‌ చేసి‘ నేను ఒక నెల క్రితం పెళ్లి చేసుకున్నాను. ఇక ఇంటికి రాను.’ అని చెప్పి రవి ఇంటికి వెళ్లిపోయాను. మా అమ్మానాన్న చాలా బాధపడ్డారు. నన్ను వెతుక్కుంటూ రవి వాళ్ల ఇంటికి వచ్చేశారు. వాళ్లు మమ్మల్ని చూశాక కన్విన్స్‌ అయి ఒప్పుకున్నారు. గ్రాండ్‌గా రిసెస్పన్‌ కూడా ఇచ్చారు. ప్రేమించినపుడు మనకు అమ్మానాన్నల విలువ తెలియదు. కానీ, మనం తల్లిదండ్రులమైనపుడు వారి విలువ తెలిస్తుంది. నేను మా అమ్మానాన్నలను చాలా బాధపెట్టాను. ఇప్పటికీ నా తప్పును సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నా.
- దివ్య


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు