ఫాదర్స్‌ డే ఎలా వచ్చిందో తెలుసా!

20 Jun, 2020 15:07 IST|Sakshi

మన జీవితం ఎలా ఉండాలో కలలు కంటూ.. ఆ జీవితాన్ని మనకు ఇవ్వడానికి కష్టపడే వ్యక్తి తండ్రి ఒక్కరే.  మనకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నిత్యం పరితపించే తండ్రికి మనం తిరిగి ఎదైనా ఇచ్చే రోజు ఉందంటే అది ఫాదర్స్‌ డే  మాత్రమే. ఈ రోజు ఎలా వచ్చింది. మొదట ఏ దేశంలో దీన్ని సెలబ్రేట్‌ చేశారో తెలుసుకుందాం. అయితే ఫాదర్స్‌ డేకు కచ్చితమైన తేదీ లేదు. ప్రతి ఏడాది జూన్‌ మూడవ ఆదివారం జరుపుకుంటారు. అయితే అన్ని దేశాలు ఒకేరోజున ఫాదర్స్‌ డేను జరుపుకోవు. ఒక్కొదేశంలో ఒక్కోరోజు, ఒక్కోనెలన జరుపుకుంటాయి. 

అమెరికన్ సివిల్ వార్ అనుభవజ్ఞుడైన విలియం జాక్సన్ స్మార్ట్ కుమార్తె సోనోరా స్మార్ట్ డాడ్  ఫాదర్స్ డేను 1910 జూన్‌ మూడవ ఆదివారం రోజున సెలబ్రేట్‌ చేసినట్లుగా ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి ఫాదర్స్‌ డే వేడుకను ప్రతి ఏడాది జరుపుకోవడం ఆనవాయితిగా మారింది. 111 దేశాలు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కొన్ని దేశాలు మాత్రం సెప్టెంబర్ నెల మొదటి ఆదివారం జరుపుకుంటారు. బ్రెజిల్లో ఆగస్టు రెండవ ఆదివారం నాడు తండ్రులను ఘనంగా సత్కరిస్తారు. కావునా ఈ ఏడాది జూన్‌ మూడవ అదివారం (జూన్‌ 21)న ఫాదర్స్‌ డేను భారతదేశంతో పాటు మరిన్ని దేశాలు కూడా జరుపుకొనున్నాయి. నీస్వార్థంగా మీ భవిష్యత్తు కోసం పరితపించే మీ తండ్రికి ఈ ఫాదర్స్‌ డే  ఎప్పటికీ గుర్తుండిపోయాలే మంచి బహుమతి ఇచ్చి సత్కరించండి. 

మరిన్ని వార్తలు