నన్ను మోసం చేసింది అనుకున్నా... కానీ!

11 Feb, 2020 15:20 IST|Sakshi

నా  ప్రాణ స్నేహితురాలు అలా చేస్తుందని  ఎప్పుడూ ఊహించలేదు. నేను ఎవరినైతే నా కంటే ఎక్కువగా ప్రేమించానో తనే ఇలా చేస్తుందని ఎన్నడూ అనుకోలేదు. నేను నమ్మిన ఇద్దరు వ్యక్తులు ఒకేసారి వెన్నుపోటు పొడిచి నాకు ద్రోహం చేసిన ఆ క్షణం నేను ప్రాణాలతో ఎందుకున్నానా అని తొలిసారి అనిపించింది. దేనినైనా భరించగలం కానీ అలాంటి బాధను  భరించలేము. అసలేం జరిగిందంటే నా పేరు లిఖిత, తన పేరు లాస్య. మా ఇంటిపక్కనే వాళ్ల ఇళ్లు. చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం. ఎప్పుడూ కలిసే ఆడుకునే వాళ్లం, కలిసే స్కూల్‌కు వెళ్లే వాళ్లం. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. నేను అన్ని విషయాలు తనతో పంచుకునే దాన్ని. మేం 8వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ల నాన్న ఉద్యోగం వేరే చోటకు మారడంతో వాళ్లు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అయినా కూడా మా స్నేహం కొనసాగుతూనే ఉంది. తరువాత బీటెక్‌లో మేం ఇద్దరం ఒకే కాలేజీలో చేశాం. చాలా హ్యాపీగా ఉండేవాళ్లం.  

బీటెక్‌ 3వ సంవత్సరంలో నాకు శ్యామ్‌ అనే ఒక అబ్బాయి ప్రపోజ్‌ చేశాడు. తను మా క్లాసే.  చాలా జోవియల్‌గా ఉండే వాడు. అతనంటే  నాకు కూడా చాలా ఇష్టం. అందుకే తను ప్రపోజ్‌ చేయగానే నేను కూడా ఓకే చెప్పేశాను. ఆ విషయం నేను వెంటనే లాస్యకు చెప్పాను. లాస్య కూడా చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యింది. శ్యామ్‌ నేను బాగా ఎంజాయ్‌ చేసేవాళ్లం. మాతో అప్పుడప్పుడు లాస్య కూడా వచ్చేది. కొన్ని రోజుల తరువాత శ్యామ్‌ ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను అవాయిడ్‌ చేయడం మొదలు పెట్టాడు. నాకు ఒక రోజు డౌట్‌ వచ్చి తన ఫోన్‌ను చెక్‌ చేశాను. ఆ ఫోన్‌ చూసి నేను షాకయ్యాను. ఎందుకంటే లాస్య శ్యామ్‌ ఒకరితో ఒకరు చాలా క్లోజ్‌గా చాట్‌ చేసుకోవడం చూశాను. ఇద్దరు నన్ను మోసం చేశారని తెలుసుకున్నాను. నేను శ్యామ్‌ను ఈ విషయం గురించి ప్రశ్నించాను. నాకు లాస్య అంటే మొదటి నుంచి ఇష్టం. తనతో క్లోజ్‌ అవడం కోసమే నీకు ప్రపోజ్‌ చేశాను అని చెప్పాడు. ఆ మాటలు వినగానే నేను ఎంతలా మోసపోయానో అర్ధం అయ్యింది. ఇంకా లాస్యతో మాట్లాడాలి అనిపించక లాస్య హాస్టల్‌ నుంచి వేరు హాస్టల్‌కు వెళ్లిపోయాను. 

కొన్ని రోజుల తరువాత శ్యామ్ ఏడుస్తూ నా దగ్గరకు వచ్చి లాస్య తనని మోసం చేసిందని చెప్పాడు.  తనకు అంతకు ముందే లవర్‌ ఉన్నాడంటా వాడితోనే ఉంటా అంటుంది,నన్ను మోసం చేసింది అన్నాడు.  నేను లాస్యను చాలా రోజులు తరువత కలిసి అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా అని అడిగాను. అవుతుంది. నీకు శ్యామ్‌ అంటే చాలా ఇష్టం కానీ శ్యామ్‌ ఒక ప్లేబాయ్‌. ఆ విషయం నీకు అర్థం కావాలనే శ్యామ్‌తో క్లోజ్‌గా ఉన్నట్లు నటించాను. తరువాత మోసం చేస్తే ఎంత బాధగా ఉంటుందో తనకి తెలిసేలా చేశాను అంది. నాకు ఒక్కసారిగా లాస్య మీద ఎంతో గౌరవం పెరిగింది. నేను తనని తప్పుగా అర్థం చేసుకున్నాను అని తెలిసింది. లాస్యను నేను జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటాను.  నువ్వు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పాను. కొన్ని సార్లు మనం నమ్మిన వాళ్లు మోసం చేశారనుకొని ద్వేషం పెంచుకుంటాం. కానీ నిజమైన స్నేహితులు  మన మంచి కోసం ఏదైనా చేస్తారు. ప్రేమ విషంలో నేను మోసపోయిన ఫ్రెండ్‌షిప్‌ విషయంలో నేను గెలిచాను. లవ్‌ యూ లాస్య.  

లిఖిత( ఏలూరు)

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా