నిజమైన మా ప్రేమ గెలుస్తుందా!

25 Nov, 2019 15:20 IST|Sakshi

 నేను విశాఖపట్నం లో ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఒంగోలు వెళ్లిపోయారు. నేను బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నపుడు ఫేస్ బుక్ లో తను నాకు మెసేజ్ చేసాడు .కొన్ని రోజులు మాట్లాడిన తరువాత తన మంచితనం, కేరింగ్, మాట్లాడే విధానం నచ్చి తనంటే ఇష్టం కలిగింది. ఫిబ్రవరిలో నేనే తనకి ప్రొపోజ్ చేశాను. దానికి తాను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒప్పుకున్నాడు. మేలో బీటెక్ కంప్లీట్ అయ్యాక తను మూడునెలలు కోచింగ్ కోసమని ఒంగోలు నుంచి వైజాగ్ వచ్చి నన్ను కలిశాడు.అతను వచ్చిన రోజు తెలియని భయం,సంతోషం ఆ ఫీలింగ్ ఏంటో మాటల్లో చెప్పలేను కానీ లైఫ్ లో కొత్త ఎక్స్పీరియన్స్ అది. నాకు బాగా నచ్చింది.

తాను రాగానే మనం గుడికి వెళదామని అన్నాడు సరే అని ఇద్దరం కలసి గుడికి వెళ్లాము. మేము అన్నవరంకు బస్సులో వెళ్లాం.అప్పుడు తను బస్సు లో ‘నేను ఏ అమ్మాయితో అయితే గుడికి వెళ్తానో తనతోనే నా పెళ్ళి జరిగుతుంది, అది నా నమ్మకం’ అని చెప్పాడు. ఆ మాటలకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే కలవగానే ఏ మూవీ కో,షికార్ల కో వెళ్లాలని అబ్బాయిలకి ఉంటుంది. కానీ తను అన్న మాట నాకు కొత్తగా అనిపించి ఇంకా తన మీద ఇష్టం పెరిగింది. అలా ఆ రోజు అన్నవరంలో దర్శనంతో ముగిసింది. అలా రోజు కలిసి కాసేపు మాట్లాడుకొని వెళ్లిపోయే వాళ్ళం.ఎప్పటిలాగే ఒక రోజు మార్నింగ్ రైతు బజార్లో కలిశాం. అయితే అక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మమల్ని చూసి మా డాడీ కి మా విషయం చెప్పారు. మా డాడీ ఒక రోజు నా దగ్గరకు వచ్చి "ఇక బజారు కి వెళ్ళటం తగ్గించమ్మ" అని చెప్పారు .అది విన్న నాకు అర్థమైంది, మా విషయం కొంత మా డాడీ కి తెలిసిపోయింది అని. మా ఫ్యామిలీలో అబ్బాయితో తిరగటం తప్పని ఫీల్ అవుతారు అందుకని కొంచెం భయపడ్డాను.

 కానీ ఆ తరువాత అంత సాఫీగా గడిచిపోయింది. ఒక రోజు మా అక్క నా ఫోన్ చూసి నన్ను అడిగింది, ఎవరు ఆ అబ్బాయి అని. నేను తనని నమ్మి అంతా చెప్పాను. తను మా డాడీ కి చెప్పేసింది. మా డాడీ నా మొబైల్ తీసేసుకున్నారు. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ లేవు. ఎలాగొల నా బీటెక్ పూర్తిచేశాను. కొన్ని రోజులు తర్వాత కోచింగ్ కి అని ఇంట్లో చెప్పి హైదరాబాద్ వచ్చేశాను. తను కూడా జాబ్ కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చేశాడు. ఇద్దరికీ మంచి జాబ్స్‌  వచ్చాయి. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు అని ఇక ఇంట్లో  మన విషయం చెప్పమని తనతో అన్నాను. దానికి అతను నెమ్మదిగ అడుగుతా అని సమాధానం ఇచ్చాడు. ఇంకో వైపు మా ఇంట్లో నన్ను పెళ్ళి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నారు. కానీ నేను ఏది ఒప్పుకోవడం లేదు. వాళ్ళకి కూడా అర్ధం అయిపోయింది నేను ఇంకా ఎన్ని అడిగినా చేసుకోను అని. నిజమైన ప్రేమ కి ఈ ప్రపంచం లో చోటు ఉందో లేదో ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది...ప్రేమతో వేచి చూస్తున్నా...

పల్లవి (విశాఖపట్నం)

మరిన్ని వార్తలు