ఆయన ఎప్పుడూ ఐ లవ్‌ యూ చెప్పరు

28 Oct, 2019 14:58 IST|Sakshi

ఈ ప్రపంచం అంతా ప్రేమ అనే రెండు అక్షరాల చుట్టూ తిరుగుతోంది. ప్రేమించానని చెప్పటం, ప్రేమ కొటేషన్లు, ఫోన్లు, చాటింగులు, ఎమోజీలు, డేటింగ్స్‌.. దురదృష్టవశాత్తు అందులో నిజమైన ప్రేమ లేదు, నమ్మకం లేదు, షేరింగ్‌ లేదు! ప్రైవసీ కావాలి ఇద్దరికీ. ఎంత ఆశ్చర్యం! ఓ వ్యక్తి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తుంటే.. ఆ ప్రేమను చేతల్లో చూపించగలగాలి. నా భర్త గత 13 ఏళ్లుగా నాపై ఉన్న ప్రేమను చేతల్లో చూపిస్తున్నారు. ఆయన నాకెప్పుడూ ఐ లవ్‌యూ చెప్పడు. తన చేతల్లో చూపిస్తారు. నేను అనారోగ్యంతో ఉంటే నా బాగోగులు చూస్తారు. నా కోసం పిల్లల కోసం ప్రత్యేకంగా వంటలు చేస్తారు. నా భర్తే నాకు గురువు, గైడ్‌, ఫ్రెండ్‌, లవర్‌, ఓ గొప్ప తండ్రి కూడా. ఆయన నన్ను అన్ని వేళలా సంతోషంగా ఉంచుతారు. అది ఐ లవ్‌ యూ అనే మూడు పదాలను మరిపిస్తుంది.

నేను అతడి పనిలో సహాయపడతాను, సేవలు చేస్తాను, ఎల్లప్పుడూ అతడి మనసుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తాను. పిచ్చిగా ప్రేమిస్తాను, ప్రతి రోజూ అతడితో ప్రేమలో పడతాను. మేము ప్రేమను కళ్లతో కాదు ఎప్పుడూ మనసుతో ఆస్వాధిస్తుంటాము. మనకిష్టమైన వారి గురించి వివరించి చెప్పటం చాలా కష్టమైన పని. ఏదో కొద్దిగా చెప్పటానికి ప్రయత్నించాను.
- లావణ్య, కాకినాడ


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు