ఆరోజు విడిపోయాం.. మళ్లీ ఇన్నాళ్లకు..

20 Jan, 2020 14:49 IST|Sakshi

ప్రేమ... అదొక అందమైన పదం. మనం నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించి ఉంటే మనస్సలో వాళ్లకి  తప్ప వేరే వాళ్లకి  చోటివ్వలేం. అంత నిజాయితీ మన ప్రేమలో ఉంటే దేవుడు కూడా మన ప్రేమను ఓడించలేడు. ఇది నిజం.. నేను ఒకబ్బాయిని ప్రేమించాను. అతను కూడా నన్ను చాలా ప్రేమించాడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మా ఇంట్లో వాళ్లని అడగలేకపోయాడు. వాళ్లింట్లో అతనికి పెళ్లి ఒత్తిడి ఎక్కువైంది. చేసేది లేక ఇక బయటికి వెళ్లి పెళ్లి చేసుకుందాం అన్నాడు. కానీ నాకు అలాంటివి ఇష్టం లేక మససు చంపుకున్నాను. తల్లిదండ్రుల మనసు బాధపెట్టి మనం సంతోషంగా ఉండలేమనేది నా అభిప్రాయం. తర్వాత వాళ్ల అమ్మానాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తను నా నుండి దూరమయ్యాక ఏడవని రోజు లేదు. బాధపడని క్షణం లేదు.

కొన్నేళ్లకి తను మళ్లీ వచ్చాడు. నా నుంచి ఇన్నేళ్లు దూరంగా ఎలా ఉండగలిగావ్‌ అని గట్టిగా అరవాలనిపించింది. అప్పుడు చెప్పాడు. తను పెళ్లిచేసుకున్న అమ్మాయి ఒక ప్రమాదంలో చనిపోయిందని. తర్వాత మా ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించి నన్ను పెళ్లిచేసుకున్నాడు. తను నన్ను వదిలేసి వెళ్లినప్పుడు అనిపించింది. నా ప్రేమలో నిజాయితీ ఉంది. ఏదో ఒకరోజు తను కచ్చితంగా నా దగ్గరకొస్తాడని. నా నమ్మకమే నిజమైంది. పరిస్థితుల కారణంగా ఆరోజు మేము దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు అవే పరిస్థితుల వల్ల మేము ఒకటయ్యాం. ఒకటే చెప్పాలనుకుంటున్నా. మన ప్రేమలో నిజాయితీ ఉంటే ఎవరూ విడదీయలేరు. నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తాన్నామంటే ఎంత మంది వచ్చినా, వాళ్లని మరిచిపోలేం. ఎందుకుంటే అదే ప్రేమ కాబట్టి.

- సావళ్ల పుష్ప

 

మరిన్ని వార్తలు