నువ్వూ వద్దు నీ ప్రేమా వద్దు..

29 Feb, 2020 12:57 IST|Sakshi

తన పేరు బుజ్జి నా జూనియర్. హ్యాపిడేస్‌ సినిమాలో లాగా తనని మొదటిసారి చూడగానే ప్రేమించా. వెంటనే తనకి చెప్పా. మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పింది. కానీ నేను మాత్రం తనని వదులుకోలేకపోయా. నా చదువు పూర్తవగానే జాబ్‌లో జాయిన్‌ అయ్యాను. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు తన నుంచి కాల్‌ వచ్చింది. ఓ ప్రాజెక్ట్‌లో హెల్ప్‌ కావాలి అని. అలా తను నాకు మళ్లీ దగ్గరైంది. అప్పుడే తన మనసులో మాటని నాతో పంచుకుంది. నువ్వంటే నాకిష్టమే. కానీ మంచి జాబ్‌లో స్థిరపడితే మా ఇంట్లో వాళ్లని ఒప్పిస్తా అంది. అప్పటికి నా జీతం 16 వేలు మాత్రమే. సో ఇంకా మంచి జాబ్‌ కోసం కోచింగ్‌ సెంటర్‌లో జాయిన్‌ అయ్యాను.

ఉద్యోగం సంపాదించి వాళ్లింటికి వెళ్లి మా ప్రేమ గురించి చెప్పి ఒప్పించాలనుకున్నా. అందుకే బాగా కష్టపడేవాడ్ని. ఈ గ్యాప్‌లో తనతో పెద్దగా ఫోన్‌లో మాట్లాడుకునే టైం దొరికేది కాదు. దీంతో మా ఇద్దరి మధ్యా గొడవలు వచ్చేవి.  ఎంత గొడవపడినా మళ్లీ తనే కాల్‌చేసి మాట్లాడేది. కానీ ఓరోజు మా మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. నా ఓప్కి నశించి తనమీద గట్టిగా అరిచేశా. అంతే ..నీమీద ఉన్న నమ్మకం అంతా పోయింది నువ్వు నాకొద్దు. నీ ప్రేమా వద్దు అని చెప్పి వెళ్లిపోయింది. అరిచింది నా బుజ్జిపైనే కదా ఎప్పటిలానే తనే మళ్లీ కాల్‌ చేస్తుంది అనుకున్నా. కానీ నా మాటలు తనని ఎంత గాయపరిచాయో అప్పుడు అర్థమైంది. కాల్‌ చేసేది కాదు. నేను ఫోన్‌ చేసినా మాట్లాడేది కాదు.

కొన్నిరోజులకి నాకు పెళ్లి అని తన నుంచి కాల్‌ వచ్చింది. ముందుగా నేను నమ్మలేదు. ఏదో కోపంగా అంటుంది అనుకున్నా .తర్వాత వాళ్ల ఫ్రెండ్స్‌ చెప్పాకా ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పనైంది. తనకి పెళ్లి అని తెలిసినప్పటినుంచి కన్నీళ్లతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. చివరిగా తను నాతో అన్న ఒకే ఒక్కమాట..నన్ను ప్రశాంతంగా బతకనివ్వు అని. ఇప్పడు జాబ్‌ చేయడం మానేశా. కోచింగ్‌ కూడా వదిలేశా. వచ్చే నెలలో తన పెళ్లి. తను ఎక్కుడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలి. 

--హరీష్‌ రాజు, నెల్లూరు


 

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు