ప్రేమ నిజంగా ఓ మత్తు మందు

10 Nov, 2019 15:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొలరాడో : మనిషికి తోడు ఎందుకవసరమో మనం కష్టాల్లో ఉన్నపుడు తెలుస్తుంది. భుజం తట్టి ధైర్యం చెప్పేవాళ్లు, ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడేవాళ్లు లేకుంటే ఆ జీవితాన్ని ఊహించటం చాలా కష్టం. జంటల మధ్య కష్టసమయాల్లో ఒకరి తోడు ఒకరికి ఎంతగానో అవసరం ఉంటుంది. శారీరకంగానూ, మానసికంగానూ తోడు అవసరం భర్తీ చేయలేనిది. ఈ విషయాన్నే పలు పరిశోధనలు కూడా ధ్రువీకరిస్తున్నాయి. భాగస్వామి (ముఖ్యంగా ఆడవాళ్లు) బాధలో ఉన్నపుడు ఎదుటి వారి(మగవారి) చేతి స్పర్శ ఎంతగానో ఉపకరిస్తుందని, వారి బాధను తగ్గిస్తుందని ‘యూనివర్శిటీ ఆఫ్‌ కొలరాడో, ఆట్‌ బౌల్డర్‌’  పరిశోధకులు చెబుతున్నారు. ‘ఇంటర్‌ పర్శనల్‌ సింక్రొనైజేషన్‌’ పై వారు జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధనకోసం 23నుంచి 32 సంవత్సరాలు కలిగిన జంటలను ఎంచుకున్నారు.

ఆ జంటలలోని ఆడవారి ముంచేతులకు కృత్తిమంగా ఓ రెండు నిమిషాల పాటు నొప్పి పుట్టేలా చేశారు. వీరిలో మగవారి చేతి స్పర్శ తగిలిన ఆడవారికి మాత్రమే నొప్పినుంచి ఉపశయనం లభించింది. మిగిలిన వారికి అలా జరగలేదు. బాధతో ఉన్నపుడు మనం ప్రేమించే వ్యక్తుల స్పర్శతో మెదడులోని యాంటీరియర్‌ స్టింగ్యులేట్‌ కార్టెక్స్‌ అనే ఓ భాగం ఆక్టివేట్‌ అవుతుందని, తద్వారా నొప్పి తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. జంటల మధ్య ప్రేమ నొప్పిని తగ్గించటంలో ఓ మత్తు మందులాగా పనిచేస్తుందంటున్నారు. 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు