తనతోనే లేదంటే ఒంటరిగానే!

22 Dec, 2019 15:25 IST|Sakshi

హాయ్‌ నా పేరు అమ్ము. నేను ఒక కాలేజీలో లెక్చరర్‌ గా పనిచేసేదానిని. తను నా కొలిగ్‌. మొదటిసారి తనని చూసినప్పుడు నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్‌ లేవు. ఎవరి పని వాళ్లు చేసుకునే వాళ్లం. నేను తనకి హాయ్‌ అని కూడా సరిగా చెప్పేదాన్ని కాదు. కానీ కొన్ని రోజుల తరువాత మేమిద్దరం ఫ్రెండ్స్‌ అయ్యాం. తను నాకు రోజు మెసేజ్‌ చేసేవాడు. అలా మా ఫ్రెండ్‌షిప్‌ పెరిగిపోయింది. ఎంతలా అంటే ఒక్కరోజు కూడా మేసేజ్‌ చేయకుండా ఉండలేకపోయేవాళ్లం. అలా మంచి ఫ్రెండ్స్‌లా ఉన్న టైంలో నేను కాలేజీలో జాబ్‌కు రాజీనామా చేశాను. మా ఇంటికి వచ్చేశాను. మా ఫ్యామిలి నా పెళ్లి  మా బావతో చేయాలి అనుకున్నారు. నాకు నో చెప్పడానికి ఏ కారణం లేకపోవడంతో నేను కాదనలేకపోయాను. తరువాత నాకు చింటూకు నేనంటే ఇష్టమని నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసింది. నేను కాలేజీ నుంచి వెళ్లిపోయేటప్పుడు అందుకే తను అంత బాధ పడ్డాడని అర్థం అయ్యింది. 

మొదట్లో ఫ్రెండ్‌ షిప్‌ అనుకున్నాం కానీ దూరం అయ్యాకే అది ప్రేమ అని తెలిసింది. ఒకరు లేకపోతే మరొకరం ఉండలేనంత దగ్గరయ్యామని అర్ధం అయ్యింది. కానీ ఇంట్లో అప్పటికే మాట ఇచ్చేశాను. చింటు వాళ్లది మా కంటే పెద్ద కులం. వాళ్ల ఇంట్లో వాళ్లకు కుల పిచ్చి ఎక్కువ. మా ప్రేమను వాళ్లింట్లో ఒప్పుకోలేదు. తను మాత్రం నేను లేకుండా ఉండలేను అంటాడు. వాళ్ల అమ్మనాన్నలకు ఒక్కడే కొడుకు. వాళ్ల నాన్నగారికి హార్ట్‌ ప్రాబ్లమ్‌ ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్లని వదిలి ఎలా రాను అని అడిగాడు. ఇన్ని సమస్యలు ఉన్న కూడా రెండు సంవత్సరాలుగా మేం మా ప్రేమను కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో ఎలా రాసిపెట్టి ఉందో తెలియదు కానీ ఉంటే తనతోనే లేదంటే ఒంటరిగానే అని నిర్ణయించుకున్నాను. ఈ రెండు సంవత్సరాలలో తను చూపించిన కేరింగ్‌, తన ప్రేమను మాటల్లో చెప్పలేను. నా జీవితంలోకి తను రావడం నా అదృష్టం. ఐ లవ్‌ యూ చింటు.

అమ్ము ( హైదరాబాద్‌)

>
మరిన్ని వార్తలు