అక్కడికి వెళ్లినప్పుడల్లా అతనే గుర్తొస్తాడు!

5 Mar, 2020 15:39 IST|Sakshi

నా పేరు కావ్య. నేను ఇంటర్వ్యూ కోసం ఒక ఆఫీస్‌కు వెళ్లాను. ఆ ఆఫీస్‌ చూడటానికి చాలా బాగుంది. అంత పెద్ద బిల్డింగ్‌ను చూడగానే భయపడుతూనే లోపలికి వెళ్లాను. రిసెస్ఫన్‌లో కుర్చున్నాను. ఇంటర్వ్యూ కోసం లోపలికి పిలవడానికి చాలా సేపే పట్టింది. నేను ఒక సోఫాలో కూర్చొని వచ్చే పోయే వాళ్లను గమనిస్తూ ఉన్నాను. అప్పుడే ఫస్ట్‌ టైం తనని చూశాను. చూడటానికి చాలా పొడవుగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. అప్పటి వరకు ఎవరిని చూసినా నాకు అంతలా నచ్చలేదు. వచ్చిన ఇంటర్య్వూ గురించి కాకుండా నా ఆలోచనలన్ని అతని చుట్టే తిరుగుతున్నాయి. ఈ ఉద్యోగం వస్తే అతనిని కలవచ్చు అనుకున్నాను. అసలు అతను ఎవరో కూడా తెలియదు. కానీ ఎందుకో నన్ను కట్టిపడేసేలా ఉన్నాడు. అందమైన అమ్మాయిని చూడగానే అబ్బాయిలు కవిత్వాలు ఎలా చెబుతారా అనుకునే దాన్ని. తనని చూశాక నచ్చిన వాళ్లు కనబడితే కవితలు, పాటలు అలాగే వస్తాయి అని అర్థం అయ్యింది. 

ఇంటర్వ్యూ బాగానే జరిగింది. ఇంటికి వెళ్లిపోయాక కూడా ఎందుకో తనే కనబడుతున్నట్లు ఉంది. ఒక రెండు మూడు రోజుల్లోనే ఆ ఆఫీస్‌ నుంచి సెలెక్ట్‌ అయినట్లు ఫోన్‌ వచ్చింది. ఎగిరిగంతేశాను. ఉద్యోగం వచ్చింది అన్న ఆనందం కన్నా అతన్ని చూస్తాను అన్న ఆనందమే ఎక్కువగా ఉంది. నేను జాయిన్‌ అయిన రెండు మూడు రోజుల దాకా అతను కనిపించలేదు. తరువాత ఒక రోజు మా డిపార్ట్‌మెంట్‌ దగ్గరకు వచ్చాడు. అప్పుడు మళ్లీ అనుకోకుండా తనని చూశాను. తన పేరు ఏంటో, ఏ డిపార్ట్‌మెంటో తెలుసుకోవాలనిపించింది.

నా కోలింగ్‌కు నేను అతనిని ఇష్టపడుతున్న విషయం చెప్పాను. అతని పేరు కాంత్‌ అని చెప్పాడు. రోజు లంచ్‌ టైమ్‌లో అతనిని చూసేదాన్ని. మా ఫ్రెండ్స్‌ అందరూ అతనిని చూడగానే నన్ను ఆట పట్టించే వారు. ఒక్కరోజు తనని చూడకపోయిన చాలా బాధగా అనిపించేది. నేను తనని చూస్తున్న అన్న విషయం తనకి కూడా తెలుసు. నన్ను చూడగానే వాళ్ల ఫ్రెండ్స్‌ కూడా తనని ఏడిపించేవారు. కాంత్‌తో మాట్లాడాలని చాలా సార్లు ట్రై చేశాను. కానీ ధైర్యం చాలలేదు. ఒకరోజు తనకి లవర్‌ ఉంది అనే విషయం తెలిసింది. చాలా ఏడుపొచ్చింది. కానీ తను వస్తే మాత్రం చూడకుండా ఉండలేకపోయేదాన్ని. అనుకోకుండా ఒక రోజు తను ఆఫీస్‌ మానేసి వేరే జాబ్‌లో జాయిన్‌ అయ్యాడని తెలిసింది. అప్పటి నుంచి ఎప్పుడు లంచ్‌ చేయడానికి క్యాంటీన్‌కు వెళ్లిన తనే గుర్తుకు వస్తాడు. తనని చాలా మిస్‌ అవుతున్నాను. 

ఇట్లు 
కావ్య(హైదరాబాద్‌)

మరిన్ని వార్తలు