నా ప్రియురాలిని మోసం చేసి.. చివరకు..

14 Oct, 2019 10:28 IST|Sakshi

నా ప్రేమ ఇప్పటిది కాదు.. 10 సంవత్సరాల క్రితంది. నేను మా చుట్టాల పెళ్లికి వెళ్లినపుడు నాకు ఓ అమ్మాయి కనపడింది. నన్ను చూస్తూ ఆమె, ఆమెని చూస్తూ నేను! ఇద్దరం ఆ రోజు అలాగే ఉన్నాము. తరువాత రోజు ఆమె మా ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఇలా అని నాకు భయం వేసింది. కానీ తను రాగానే మా అమ్మని పలకరించింది. అప్పటివరకు నాకు తెలియదు ఆమె మాకు చుట్టాలు అవుతారని. నేను కూడా ఆమెతో మాట్లాడాను. నేను కాలేజీకి వెళ్తూ పార్ట్ టైం జాబ్ చేస్తుండే వాడిని. ఆమె అక్కడికి వచ్చేది. నాకు మొబైల్ అంటేనే చిరాకు, అలాంటిది ఆమె ప్రతిసారి నెంబర్ అడిగినప్పుడు ఎక్కడో ఫీల్! మొబైల్ తీసుకొని నెంబర్ ఇచ్చాను. ఇక అప్పటినుంచి రాత్రిళ్లు బాగా మాట్లాడుకునే వాళ్లం. వాళ్ల అక్కకు పెళ్లి సంబంధం వస్తే వెళ్లారు. వాళ్లు ఎవరో కాదు మా ఫ్రెండ్ అన్నయ్య. ఆ పెళ్లి సంబంధానికి వెళ్లినపుడు నా ఫ్రెండ్ నేను ప్రేమించే అమ్మాయినే ప్రేమిస్తున్నానని చెప్పాడు.

అప్పుడు ఆమె నాకు ఇష్టం లేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ, వాడు కారణం లేకుండా నేను వదులుకోను అంటే వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నా అని నా పేరు చెప్పి తప్పించుకుంది. ఒక రోజు ఆ విషయం వాడు నాకు చెప్పాడు. ఇక నా ఆశలు బాగా పెరిగాయి. నా ప్రేమ విషయం ఆమెతో వెళ్లి చెప్పాను. కానీ తను మాత్రం ‘‘తప్పించుకునే ప్రయత్నంలో నేను నీ పేరు చెప్పాను’’ అని అంది. నాకు చాలా బాధ వేసింది, అలాగే ఆమెతో మాట్లాడుతూ ఎప్పటికైనా అర్థం చేసుకుంటుందన్న ఆశతో ఉన్నాను.

కానీ ఆమె మనసులో ఇంకో అబ్బాయి ఉన్నాడని తెలిసింది. ఇక ఆమె ప్రేమకు తోడుగా ఉందాం అనుకునే లోపే ఆమెను వాడు మోసం చేశాడు. కొన్ని నెలలు ఆమె నాతో మాట్లాడడం మానేసింది. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు’’  అని నిలదీసి పెళ్లి ప్రస్తావన తెచ్చాను. ఆమె నేను చెప్పిన మాటలకు షాక్‌లో ఉన్నానని, అస్సలు రాత్రి నిద్ర పట్టట్లేదని అంది. ‘‘ నీ అభిప్రాయం కోసం నేను వేచి ఉన్నాను’’  అని చెప్పా. కొన్ని రోజులకు ఆమె పెళ్లి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నేను ఆ అమ్మాయిని మరిచిపోలేక చనిపోవడానికి వెళ్తే నా ఫ్రెండ్స్ ధైర్యం చెప్పి జీవితం అంటే ఎంటో తెలిపారు. ఆమె అప్పుడప్పుడు కనపడుతుంది మంచిగానే మాట్లాడుతుంది.
- కిశోర్ బాబు, మహబూబ్ నగర్ (పేర్లు మార్చాం)


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు