అమెరికా సంబంధం.. అందుకే చేసుకున్నా!

21 Dec, 2019 12:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నా లవ్‌స్టోరీ నా పదహారవ ఏట మొదలైంది. ఆ అమ్మాయికి అప్పుడు 14 ఏళ్లు. మేము ఫ్రెండ్స్‌గా ఉన్నాము. నాకు క్రికేట్‌ అంటే పిచ్చి! పెద్ద క్రికేటర్‌ అవ్వాలని ఆశ. మా పేరెంట్స్‌ నన్ను బాగా చూసుకునేవాళ్లు. కానీ, నా దురదృష్టం కొద్ది నాన్న చనిపోయారు. దీంతో మాకు కష్టాలు మొదలయ్యాయి. కానీ, నా కష్టాలు చూసిన దేవుడు ఆర్మీలో జాబ్‌ వచ్చేలా చేశాడు. అప్పుడు నా వయసు 17. అది 2005.. అప్పుడు ట్రైనింగ్‌ కోసం వెళ్లాను. ఆ అమ్మాయి నన్ను మర్చిపోయింది. నా దగ్గర తన అడ్రెస్‌ ఉండటంతో ఆర్మీ ట్రైనింగ్‌లో ఉన్నానని ఓ లెటర్‌ రాశాను. నాకు రిప్లై వచ్చింది. చాలా సంతోషంగా ఫీల్‌ అయ్యాను. అలా మా లెటర్స్‌ వల్ల ప్రేమ చిగురించింది. నేను సెలవుల మీద ఊరికి వచ్చాను. ఆ అమ్మాయి చాలా దూరంగా ఉందని తెలిసింది. అయినా తనను వెతుక్కుంటూ వెళ్లి ప్రపోజ్‌ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్‌ అయింది.

లైఫ్‌లాంగ్‌ కలిసి ఉండాలని అనుకున్నాం. ఆర్మీజాబ్‌లో ఎన్నో కష్టాలు పడ్డాను. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ అమ్మాయిని మాత్రం వదల్లేదు. మా లెటర్స్‌ కాస్తా ఫోన్‌ అయ్యంది. డ్యూటీ చేసి నిద్రలేకుండా మాట్లాడాను. అలా పదకొండేళ్లు ప్రేమించుకున్నాం. 2015లో నేను స్పెషల్‌ ట్రైనింగ్‌లో ఉన్నాను. ఈ సారి కచ్చితంగా పెళ్లి చేసుకుందాం అని అంతకు ముందే తనకు చెప్పాను. ట్రైనింగ్‌లో ఉండి 30 రోజులు ఫోన్‌ చేయలేదు. ఆ తర్వాత కాల్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. మా ఫ్రెండ్‌ కాల్‌ చేశాడు ‘ఆ అమ్మాయికి పెళ్లైంది’ అని. చెప్పుకోలేని బాధ! ఏడ్చాను. ఒక నెల తర్వాత లీవ్‌ మీద వచ్చాను. కాల్‌ చేసి అడిగాను. కలవాలని అంది. ఒకే చెప్పాను. ఇద్దరం కలిసినపుడు పెళ్లి గురించి అడిగితే ‘అమెరికా సంబంధం అందుకే చేసుకున్నా. నువ్వు ఆర్మీ. అందుకే నీకంటే మంచి జాబ్‌లో ఉన్న వాడిని చేసుకున్నా.’ అంది.
- కే ఆర్‌ రెడ్డి

చదవండి : నన్ను ఎందుకిలా చంపుతున్నావ్‌!
నాన్న మాట కాదనను.. నిన్ను వదులుకోను



లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు