ఓ మంచి అమ్మాయిని మిస్‌ అయ్యా

7 Nov, 2019 16:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నా స్కూల్‌ క్లాస్‌మేట్‌ తను. పేరు అనూష! ఇద్దరం ఎల్‌కేజీనుంచి 9 వరకు కలిసే చదువుకున్నాం. ప్రతిరోజూ ఒకే బస్‌లో కలిసి వెళ్లటం వల్ల బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. చాలా చనువుగా ఉంటాం. బాగా మాట్లాడుకునేవాళ్లం కూడా. సడెన్‌గా ఓ రోజునుంచి మా ఇద్దరి మధ్యా ఉన్న స్నేహానికి ప్రేమ అని పేరు పెట్టి మా క్లాస్‌మేట్స్‌​ టీజ్‌ చేయటం మొదలుపెట్టారు. స్కూల్లో ఎక్కడ చూసినా నన్ను ప్రత్యూష అని పిలవటం మొదలుపెట్టారు. కొన్ని రోజులు సరదాగా ఉన్నా. తర్వాత ఒకసారి సడెన్‌గా మా ఫ్రెండ్స్‌ మీద సీరియస్‌ అయ్యాను. ఆ వార్నింగ్‌ తర్వాత అందరూ టీజ్‌ చేయటం ఆపేస్తారని అనుకున్నా.. వాళ్లు ఇంకా ఎక్కువ చేశారు. నాకు ఎక్కడో ప్రత్యూష మీద ఇష్టం అందుకే ఎక్కువగా రియాక్ట్‌ అవ్వలేదు.

ప్రత్యూషకు అది నచ్చలేదో ఏమో మరి నాతో మాట్లాడటం మానేసింది. అలా 8, 9 చదువులు పూర్తయ్యాయి. ఓ రోజు ప్రత్యూషనుంచి నాకో మెసేజ్‌ వచ్చింది తన నుంచి ‘స్కూల్‌ మారుతున్నా’ అని నాకు చాలా గిల్టీగా అనిపించింది. నాకు కూడా ప్రత్యూష ఇబ్బంది పడటం ఇష్టంలేదు. నేను ఏమీ మాట్లాడలేదు. 10, ఇంటర్‌ అయిపోయింది కానీ, ఫ్రెండ్స్‌ ఆమె పేరు మర్చిపోలేదు. ఓ రోజు ఎమ్‌సెట్‌ ఎక్షామ్‌ హాల్‌లో తనను చూశా. కానీ, తను నన్ను చూడలేదు. హాల్లో తను నా వెనుక సీట్లో కూర్చుంది. నాకు మైండ్‌ పనిచేయలేదు చాలా సేపు. అక్కడే సారీ చెప్పాలని ఉంది కానీ ప్రత్యూష నన్ను చూడలేదు. తర్వాత ఇంజనీరింగ్‌ జాయిన్‌ అయ్యాను.

ఓ రోజు హాలిడేస్‌కు ఇంటికి వెళుతూ బస్టాప్‌లో నిల్చున్నా! ప్రత్యూష గురించే ఆలోచిస్తూ ఉండగా ఆమె కూడా బస్‌ కోసం వచ్చింది. ఆ తర్వాత చాలా రోజులు ఆలోచించా.. ప్రత్యూష అంటే లవ్‌ అని అర్థమైంది. ఎందుకో తన గురించి ఆలోచిస్తుంటే చాలా పవిత్రంగా ఉంటుంది. ఇంజనీరింగ్‌ అయిపోయిన తర్వాత నాకో జాబ్‌ వచ్చింది. ఆ విషయం తనకు చెప్పటానికి ఎంతో ట్రై చేశా. తనకు ప్రపోజ్‌ చేయాలనిపించింది. ఒకరోజు బెంగళూరులో ఉండగా మా ఫ్రెండ్‌తో కలిసి రెస్టారెంట్లో లంచ్‌ చేస్తున్నా. సడెన్‌గా అనూష వచ్చింది. ఈ సారి జంటగా బాయ్‌ ఫ్రెండ్‌తో వచ్చింది. తను చాలా హ్యాపీగా ఉంది! అది చాలు నాకు. నా లేట్‌ కారణంగా ఓ మంచి అమ్మాయిని మిస్‌ అయ్యా.
- క్రిష్ణ వంశీ  


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు