మా మధ్య ఉన్న బంధం ఏంటో అర్థం కావడం లేదు!

28 Nov, 2019 14:54 IST|Sakshi

నా పేరు రవి. బీటెక్‌ పూర్తి చేశాను. ప్రస్తుతం జాబ్‌ ట్రైల్స్‌లో ఉన్నాను. తను నాకు ఇంటర్‌లో పరిచయం అయ్యింది. తనకు ముందే లవర్‌ ఉన్నాడు. అప్పుడప్పుడు నాతో మాట్లాడేది. బీటెక్‌లో ఒకే కాలేజీలో చేరాం. తరువాత ఫ్రెండ్స్‌ కాస్తా బెస్ట్‌ఫ్రెండ్స్‌ అయ్యాం. తనకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా తన లవర్‌ కంటే ముందు నాతోనే పంచుకునేది. నేను కూడా నా ప్రతి విషయాన్ని ఆమెతోనే పంచుకునే వాడిని. ఆమెకు లవర్‌తో గొడవలు జరుగుతున్నాయి అంటే మొదట్లో నేను పట్టించుకునే వాడిని కాదు. తరువాత ఆ గొడవలకు కారణం నేనే అని తెలిసి ఆమెతో మాట్లాడటం మానేశాను. కానీ ఎక్కువ కాలం అలా ఉండలేకపోయాను. మళ్లీ మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాము. ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ఆమె మీద నాకు ప్రేమ పుట్టింది. తనకు చెబుదాం అంటే ఉన్న ఫ్రెండ్‌షిప్‌ కూడా పోతుందేమో అనే భయంతో చెప్పలేదు. 

కొన్నిసార్లు తనకు కూడా నా మీద ఫీలింగ్స్‌ ఉన్నయ్యేమో అనిపించేది. కానీ ఎప్పుడూ అడిగే ధైర్యం చేయలేదు. బీటెక్‌ లాస్ట్‌ డే తనకు నా ఫీలింగ్స్‌ చెప్పాను. తను కూడా సేమ్‌ టు యూ అని చెప్పింది. తరువాత మేం రోజు మాట్లాడుకునే వాళ్లం. తరువాత కొన్ని రోజులకు ఆమె తనకు తన ఫస్ట్‌ లవర్‌ గుర్తొస్తున్నాడు అని చెప్పింది. నాకు ఏం చెప్పాలో తెలియక నీ ఇష్టం అని చెప్పాను. తను వెళ్లిపోయింది. మళ్లీ కొన్ని నెలల తరువాత నేను ఆ అమ్మాయి మాట్లాడుకోవడం స్టాట్‌ చేశాం. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటో అర్ధం కావడం లేదు. ఆమె మాత్రం నాకు కావాలి అనిపిస్తుంది. ఆ విషయం ఆమెను అడగలేకపోతున్నా...ఇప్పుడు నేనేం చేయాలో మీరే చెప్పండి. 

రవికుమార్‌ (కర్నూల్‌)
 

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు