‘ముత్యమంత ముద్దు’లాంటి ప్రేమ

3 Nov, 2019 11:04 IST|Sakshi
ముత్యమంత ముద్దు చిత్రంలోని ఓ దృశ్యం

లవ్‌ సినిమా

మూవీ : ముత్యమంత ముద్దు
నటీనటులు : రాజేంద్రప్రసాద్‌, సీత, రంగనాథ్‌, మురళీమోహన్‌, సుధాకర్‌ తదితరులు
దర్శకుడు : రవిరాజా పినిశెట్టి

కథ : విద్యాధరి (సీత) చిన్నతనంలో తన తండ్రి, తల్లిని హింసించటం చూసి మగవాళ్ల ప్రేమను నమ్మకూడదనే భావనతో ఉంటుంది. పెద్దయ్యాక ఇంటి యజమాని, అతని కొడుకు, ఆఫీసులో బాసు ప్రవర్తనలతో మగవాళ్ల ప్రేమపై నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. విద్యాధరి ఆపదలో ఉన్న సమయంలో అనుదీప్‌(రాజేంద్రప్రసాద్‌) ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నాని చెబుతాడు. అయితే ఆమె అతడి ప్రేమను అంగీకరించదు. అయినా అతడు విద్యాధరికి తోడుగా ఉంటూ తనకున్న అద్భుత శక్తులతో ఆమెను ఆపదలనుంచి కాపాడుతుంటాడు. ఆమె ప్రేమ కోసం ఎదురుచూస్తుంటాడు. అయితే "మెస్మరిజం"తో తనను మోసం చేస్తున్నాడని భావించి విద్యాధరి అతడిని ఛీకొడుతుంది.

చివరకు విద్యాధరి ప్రేమ కోసం అనుదీప్‌ తన శక్తులను వదులుకుంటాడు. ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలతో ఆమె ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. అసలు అనుదీప్‌కు ఆ అద్భుత శక్తులు ఎలా వచ్చాయి? విద్యాధరి ఆ హత్య కేసులో ఎలా ఇరుక్కుంటుంది? శక్తులు లేని అనుదీప్‌ ఆమెను రక్షించుకుంటాడా? లేక తనే ప్రమాదంలో పడతాడా? విద్యాధరి, అనుదీప్‌ ప్రేమను అంగీకరిస్తుందా?లేదా?. అనేదే మిగితా కథ. 

విశ్లేషణ : 
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ నవల ‘ థ్రిల్లర్‌’’ ఆధారంగా 1980లలో తెరకెక్కిన ఈ సినిమా ఓ గొప్ప ప్రేమ కావ్యం. ఇదో ఫిక్షన్ స్టోరీ అయినా ప్రేమకున్న శక్తిని రచయిత కళ్లకు కట్టినట్లు చూపించాడు. రాజేంద్రప్రసాద్‌, సీతల నటన పాత్రలకు ప్రాణం పోసినట్లు ఉంటుంది. సినిమా చూసిన వాళ్లకు నిజంగా ప్రేమకు ఇంత శక్తి ఉందా? అని అనిపించకమానదు. ప్రేమలో ఉన్నవాళ్లు, విఫలమైన వాళ్లు సినిమా అయిపోయిన తర్వాత గాఢంగా ఓ నిట్టూర్పు విడువక మానరు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు