ఆయన చాలా నీచంగా మాట్లాడాడు

30 Nov, 2019 14:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నాది పశ్చిమ గోదావరి జిల్లా. నేను వైజాగ్‌లో జాబ్‌ చేస్తున్నపుడు ఓ అమ్మాయి వాట్సాప్‌ ద్వారా పరిచయం అయ్యింది. ఆ పరిచయం ద్వారా కొన్ని నెలల తర్వాత నేను తనకు ప్రపోజ్‌ చేశా. కొద్ది రోజుల తర్వాత తను నా ప్రపోజల్‌ను అంగీకరించింది. అప్పుడు నాకర్థమైంది తను నాకంటే ఏజ్‌లో చాలా చిన్నదని. నేనో రోజు ‘నీకు నాకు మధ్య చాలా ఏజ్‌ గ్యాప్‌ ఉంది. ప్రేమ గీమా వద్దు’ అన్నాను. అప్పుడు తను ‘నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా’ అని అంది. అలా కొద్దిరోజులు గడిచిన తర్వాత నేను పూణెకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యా. అప్పుడు ఈ విషయం గురించి తను వాళ్ల అమ్మకు చెప్పింది. వాళ్ల అమ్మ మాకు బాగా సపోర్ట్‌ చేసింది. ‘నా భర్తకు చెప్పి మీ పెళ్లి చేయిస్తాను’ అని మాట ఇచ్చింది. పూణెలో జాబ్‌ చేస్తున్న నేను జాబ్‌ వదిలేసి వాళ్ల డాడ్‌ దగ్గరకు వచ్చా. ఆయన వెంట ఉంటే తన కూతురికి నాకు పెళ్లి చేస్తామని అన్నారు. రెండు నెలల తర్వాత మా ఫ్యామిలీని తీసుకురమ్మన్నారు.

మా పెళ్లికి వాళ్ల నాన్న మొదట సరే అన్నారు. ఏం అయ్యిందో ఏమో తెలియదు కానీ, కొద్దిరోజుల తర్వాత ఆయన చాలా నీచంగా మాట్లాడాడు. ఇవన్నీ తెలిసినా వాళ్ల అమ్మ చాలా కామ్‌గా ఉండిపోయింది.   నేనంటే నీకు ఇష్టమా లేదా అని తనను అడిగా ఫైనల్‌గా! అప్పుడు కూడా నేనంటే ఇష్టమే అని చెప్పింది. మరి మీ నాన్నకు చెప్పు అంటే చెప్పను అంది. అప్పుడర్థమైంది వాళ్లు నాతో గేమ్స్‌ ఆడుతున్నారని. రెండేళ్ల నుంచి నన్ను లవ్‌ చేస్తున్నా అని నమ్మించి పెళ్లి చేసుకున్న తర్వాత వదిలిపెట్టిపోయింది. అయినా నాకు తన మీద ప్రేమ తగ్గలేదు. నేను తనతో మాట్లాడిన మాటలు, తిరిగిన ప్రదేశాలు అన్నీ ఇప్పటికీ గుర్తుకు వస్తాయి. నాకు పిచ్చి ఎక్కినట్లు ఉంది.
- జాన్‌ హైడ్‌

చదవండి : అందుకే వాళ్లు నన్ను రిజెక్ట్‌ చేశారు
అలా చేస్తే మొదటికే మోసంలేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు