నిన్ను మర్చిపోవటమంటే చచ్చిపోవటమే!

23 Dec, 2019 14:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

2014లో నేనొక అమ్మాయిని చూశాను. అప్పుడు నేను బీఎస్‌సీ ఫైనల్‌ ఇయర్‌. తను ఓ ట్రైనింగ్‌ కోసం వచ్చింది. అప్పుడు తనతో నాకు పరిచయం ఏర్పడింది. తర్వాత కొన్ని రోజులకు నేను తనకు ప్రపోజ్‌ చేశా. ఓకే అంది. మా ఇద్దరి మధ్యా ఎన్నో గొడవలు అంతకుమించి ఎంతో ప్రేమ.. అలా 5ఏళ్లు గడిచిపోయాయి. ఈ ఐదేళ్లలో తను లేకపోతే నేను లేను అనేంతలా ప్రేమ చూపించింది. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. మా ఇద్దరి కులాలు ఒక్కటికాదు. అయినా నేను ఓ సంవత్సరం వేయిట్‌ చేసి తనను పెళ్లి చేసుకుంటానని అడిగా. తను సరే అంది. ఒకరోజు ఫోన్‌ చేస్తే ‘ నాకు మ్యారేజ్ ఫిక్స్‌ అయ్యింది. ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యింది.’ అని చెప్పింది.

అప్పటినుంచి నా గుండెలో బాధ మొదలైంది. ఆమెకు ఇష్టం లేకపోయినా తన ఫ్యామిలీ కోసం ఓకే చెప్పిందని తెలిసింది. అప్పుడు నేను ‘వచ్చేయ్‌ నాతో! పెళ్లి చేసుకుందాం.’ అని అన్నాను. తనేమో రానని చెప్పేసింది. ఇప్పటికీ తన గురించే ఆలోచన నా ప్లేస్‌లో వేరే వాడిని ఊహించుకోలేకపోతున్నా. నా ఊపిరి ఉ‍న్నంత వరకు నేను తనని మర్చిపోలేను. నువ్వు లేని నా జీవితం శూన్యం. నువ్వే నా ప్రపంచం.. నా ఆలోచన నువ్వు.. నువ్వు గుర్తురాని సెకండ్‌ లేదు. జాగ్రత్త బంగారం. ఐ మిస్‌ యూ.. నేను నిన్ను మర్చిపోవటమంటే చచ్చిపోవటమే.
- క్రిష్ణ
చదవండి : 
ఇలాంటోళ్లు రొమాన్సులో పిచ్చోళ్లు! 

ఆమెకు అనుమానం..అందుకే వీలుచిక్కినప్పుడల్లా..



లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు