బాగుంటాడు.. కారు ఉంది.. పెళ్లి చేసుకోనా?

21 Dec, 2019 13:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేను ఒక రోజు పని మీద భీమవరం నుండి పాలకొల్లు వెళ్లాను. వచ్చేటప్పుడు ట్రైన్ ఎక్కడానికి పాలకొల్లు రైల్వేస్టేషన్‌కి వెళ్లాను. అక్కడ ఒక అమ్మాయి బెంచి మీద కూర్చుని ఉంది. చూడగానే ‘ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుందే’ అనిపించింది. ట్రైన్ ఎక్కాక ధైర్యం చేసి మాట్లాడాను. మాటల్లో తన పేరు అడిగాను! తులసి అని చెప్పింది. తనది కూడా భీమవరం. తనకి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఒక నెల రోజుల తరువాత ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిప్ట్ చెయ్యగానే ‘నేను తులసి’ అని అంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. రోజూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. తను అప్పుడు డిగ్రీ చదువుతోంది. నేను ఒకరోజు తనని కలిసి పెళ్లి చేసుకుందామని అడిగాను. డిగ్రీ అయ్యాక చేసుకుందాం అంది. అలా 2 సంవత్సరాలు గడిచాయి.

తర్వాతి నుంచి తను నాతో మాట్లాడటం తగ్గించేసింది. ఫోన్ చేస్తే లిప్ట్ చేయట్లేదు. తను వేరే అబ్బాయితో లవ్లో ఉన్నదని తెలిసింది. ఈ విషయం తనను అడిగితే అవునని చాలా సీరియస్‌గా చెప్పి ‘ఇంకెప్పుడూ నాకు ఫోన్ చెయ్యొద్దు’ అని అంది. నేను చాలా బాధపడ్డాను. ఏడ్చాను,మనసులో చెప్పలేనంత బాధ! ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కొన్ని రోజులు తర్వాత ఒక కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిప్ట్ చేయగానే తన గొంతు విని మనసంతా బాధ. కానీ పైకి మాత్రం చాలా సీరియస్‌గా ‘చెప్పు’ అన్నాను. ముందు సారీ చెప్పింది. వాడెవడో గోల్డ్ డబ్బులు వాడుకుని తనను మోసం చేసాడంట, నాకు జాలేసింది.

నేను ధైర్యం చెప్పి పెళ్లి చేసుకుందామని అడిగాను. సరే అంది. సడెన్‌గా ఒక రోజు ఫోన్ చేసి ‘నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది. అతడు చాలా బాగుంటాడు, కారు కూడా ఉంది! చేసుకోనా?’ అని అడిగింది. నా గొంతు మూగబోయింది. రెండు నిముషాలు నేను ఏమీ మాట్లాడలేదు. ఫోన్ కట్ అయ్యింది. 2016లో మళ్లీ కొత్త నెంబర్ నుంచి ఫోన్‌.. అదే గొంతు మళ్లీ సారీ చెప్పింది. మళ్లీ మోసపోయింది. ఆమె భర్తకి చాలా అప్పులు ఉన్నాయంట. చెప్పకుండా అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకున్నాడంట. నేను తనకి ధైర్యం చెప్పి ఫోన్ కట్ చేశాను. తనకి ఇప్పుడు ఒక బాబు. తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
- నాని, భీమవరం


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు