ఓ రెండేళ్లు ఎదురుచూడు ప్లీజ్‌!

25 Dec, 2019 16:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అది 2011, నేనపుడు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను. ఒకరోజు నా మొబైల్‌కు ‘హాయ్‌! హౌ ఆర్‌ యూ’ అని మెసేజ్‌ వచ్చింది. నేను ‘ఎవరు’ అని రిప్లై ఇచ్చాను. ‘నవీన్‌’ అన్నాడు. అతనికి నా ఫ్రెండ్‌ వాళ్ల లవర్‌ నా ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు. అలా ప్రతిరోజూ మెసేజ్‌లు, కాల్స్‌ చేసుకునేవాళ్లం. తన విషయాలు అన్నీ నాకు చెప్పేవాడు. ఒక రోజు తనను చూడాలనిపించి ఇంటికి రమ్మన్నాను. వాళ్ల ఫ్రెండ్‌ను తీసుకుని వచ్చాడు. అదే అతన్ని నేను మొదటిసారి చూడటం. కొద్ది సేపు అక్కడే ఉన్నాడు. మాట్లాడుకున్నాం. తర్వాత వెళ్లిపోయాడు. ఆ తర్వాత ‘లవ్‌ యూ’ అని మెసేజ్‌ చేశాడు. నేను సమాధానం చెప్పలేదు. కొద్దిరోజుల తర్వాత ఒప్పుకున్నా. తన మాటలు, ప్రవర్తన నాకు చాలా బాగా నచ్చాయి. ఇంటర్‌ ఎక్షామ్స్‌ అయిపోయిన తర్వాత తను ముంబై వెళ్లిపోయాడు. తన దగ్గరినుంచి ఏ మెసేజ్‌ కానీ, ఫోన్‌కాల్‌ కానీ రాలేదు.

అతను వెళ్లిపోయిన తర్వాత నాకు అతనంటే చాలా ఇష్టం పెరిగింది. ఒక రోజు కాల్‌ చేశాడు. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. రోజూ మెసేజ్‌లు, ఫోన్లతో బిజీగా ఉండేవాళ్లం. మా విషయం మా అమ్మకు తెలిసింది. నన్ను తిట్టింది! మా నాన్నకు కూడా చెప్పింది. అతని ఇంట్లో వాళ్లతో చెప్పమను పెళ్లి చేస్తామన్నారు. అతను రెండు సంవత్సరాలు టైం అడిగాడు. మా వాళ్లకు విసుగు వచ్చి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ విషయం అతనికి చెప్పాను‘ నిన్ను తప్ప ఎవరినీ చేసుకోను’అని.   అతనికి కూడా నేనంటే పిచ్చి ప్రేమ. ఇద్దరం రోజూ బాధపడేవాళ్లం. అతను వాళ్ల పేరెంట్స్‌కు చెప్పటానికి భయపడేవాడు. అతనికి వాళ్ల మరదల్ని ఇచ్చి పెళ్లిచేయాలనుకుంటున్నారని, ఈ సమయంలో మా ప్రేమ విషయం చెబితే ఒప్పుకోరని అన్నాడు.

అతడి మీద కోపం వచ్చింది. దీంతో మా వాళ్ల కోసం వాళ్లు చూసిన అతడినే పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయ్యా. అతడిని దూరం పెట్టా. నన్ను మర్చిపోమని చెప్పా. చాలా ఏడ్చాడు. ‘రెండేళ్లు ఎదురుచూడు ప్లీజ్‌!’ అంటూ బ్రతిమాలాడు. మా అమ్మతో మాట్లాడాడు. ‘మీ వాళ్లను ఒప్పించు, లేకపోతే మా అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేస్తాము’ అంది. అతని మీద కోపంతో నన్ను నేను ఇబ్బంది పెట్టుకున్నా. ఇటు అతడ్ని దూరం చేసుకోలేక, మా వాళ్లను దూరం పెట్టలేక చాలా అవస్థలు పడ్డాను. తను ధైర్యం చేసి వాళ్ల ఇంట్లో వాళ్లకు విషయం చెప్పేశాడు. ‘ ఆ అమ్మాయే కావాలి! లేకపోతే చచ్చిపోతా’ అని అన్నాడు. వాళ్లు ఒప్పుకున్నారు. మా వాళ్లతో మాట్లాడారు. 2013లో మా పెళ్లి అయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. 
లవ్‌ యూ ఫరెవర్‌ లడ్డూ! 
- రేణుక


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు