నువ్వు కుదరదంటే చచ్చిపోతా!!

20 Feb, 2020 12:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అతడి పేరు సుభాష్‌! మా ఇంటి పక్కనే వాళ్ల ఇళ్లు. మా రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్‌ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దూరపు బంధుత్వం కూడా. తను నాకు బావ వరుస అవుతాడు. చాలా స్నేహంగా ఉండేవాళ్లం చిన్నప్పటినుంచి. ఇంటర్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నపుడు నాకు ప్రపోజ్‌ చేశాడు. నేనప్పుడు ఓకే చెప్పలేదు. డిగ్రీ ఇద్దరం ఒకే కాలేజ్‌లో చేరాము. నెలకోసారైనా నాకు ఐ లవ్‌ యూ చెప్పేవాడు. తెలిసిన వ్యక్తి, మంచి వాడు, పైగా రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్‌ ఉంది! కాబట్టి, పెళ్లికి ఒప్పుకుంటారని నేను డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ సెకండ్‌ సెమ్‌లో ఓకే చెప్పాను. నాతో చాలా ప్రేమగా ఉండేవాడు.

ఓ వ్యక్తినాపై ఇంతలా ప్రేమ చూపించడం నాకు బాగా నచ్చేది. చూస్తుండగానే మా ప్రేమలో ఏడేళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఈ ఏడేళ్లలో ఎన్నో మార్పులు. నాకు, అతడికి మధ్య ఎన్నో కలవని పాయింట్లు ఉన్నాయి. రోజురోజుకు అతడిపై ప్రేమ తగ్గుతూ వచ్చింది. ఇక మీదట అతడితో కలిసి ఉండటం కుదరదనిపించింది. ఇదే విషయం అతడికి చాలాసార్లు చెప్పి చూశాను. ‘ నేను నీతో కలిసి ఉండలేను’ అని. దానికి అతడు చాలా సీరియస్‌ అయ్యేవాడు, బాగా తిట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత క్షమాపణలు చెప్పి, ‘ నువ్వు కుదరదంటే నేను చచ్చిపోతాను’ అనేవాడు.

అయినా పట్టువదలకుండా అతడికి నచ్చజెప్పటానికి ప్రయత్నించేదాన్ని. ‘మనిద్దరి దార్లు వేరు.. ఎప్పటికీ కలవవు’ అని. పట్టించుకునేవాడు కాడు. మేమిద్దరమూ పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం మా ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. నేను మా ఇంట్లో ఈ విషయం చెప్పటానికి ప్రయత్నించినపుడు వాళ్లు కూడా నా మాట వినలేదు. అతడితో బ్రేకప్‌ చెప్పి, మా రిలేషన్‌కు ఓ ఎండ్‌కార్డ్‌ వేద్దామని చేస్తున్న ప్రయత్నం ఎప్పటికి ఫలిస్తుందో.  
- శీ విధ్య, సూర్యాపేట


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు