నాకు ధైర్యం వచ్చింది.. ఆమె రిప్లై ఇచ్చింది

8 Jan, 2020 16:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేను, తను చిన్నప్పుడు 5వ తరగతి వరకు కలిసి చదువుకున్నాము. నేను తనతో తప్ప అందరితో మాట్లాడేవాడిని. తను కూడా నాతో అంతగా మాట్లాడేది కాదు.. ఏదో ఒక సందర్భంలో మాట్లాడేవాళ్లం. అలా ఉండగా తరువాతి సంవత్సరం తను వేరే స్కూల్‌కు వెళ్లిపోయింది. నాతో మాట్లాడే నలుగురు నా పక్కనే ఉన్నా ఏదో తెలియని వెలితి ఉండేది. సరిగ్గా తొమ్మిది సంవత్సరాల తరువాత నేను బీటెక్ రెండవ సంవత్సరంలో ఉన్నపుడు తన కోసం ఫేస్‌బుక్‌లో వెతికి చూశాను. తన ఐడీ దొరికింది కానీ, రిక్వెస్ట్‌ పంపడానికి రెండు నెలలు పట్టింది. రిక్వెస్ట్ పంపిన చాలా రోజుల తర్వాత ఒక రోజు తను ఆక్సెప్ట్‌ చేసినట్లు నోటిఫికేషన్‌ వచ్చింది.

రెండు వారాల తర్వాత మెసేజ్ చేయడానికి ధైర్యం వచ్చింది. తన దగ్గరినుంచి కూడా రిప్లై వచ్చింది. అలా వారానికి ఒకసారి మెసేజ్ చేసేవాడిని. ఓ రోజు తన నెంబర్ అడిగితే ‘ఎందుకు? ఫేస్‌బుక్‌ ఉందిగా’ అని తను నెంబర్‌ ఇవ్వలేదు. కొన్ని రోజుల తరువాత ఎగ్జామ్స్‌ ఉండడం వలన వేరే కారణం చెప్పి! ‘నేను ఫేస్‌బుక్‌లోకి రాను’ అని నా సెల్ నెంబర్ తనకిచ్చి ‘మెసేజ్ చేయాలనిపిస్తే చేయ్‌!’ అని చెప్పా. పది రోజుల తరువాత వాట్సాప్‌లో మెసేజ్ చేసింది. అలా రెండు సంవత్సరాలు ప్రతిరోజూ వాట్సాప్‌ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. అనుకోకుండా కొన్ని రోజులు తను మెసేజ్ చేయడం మానేసింది.

రెండు సార్లు అడిగాను ‘ఊరికే చేయలేదు. ఇంకో వాట్సాప్‌ వాడుతున్నా’ అని ఆన్‌లైన్‌ నుంచి వెళ్లిపోయేది. ‘సరే! ఇక నిన్ను డిస్ట్రబ్‌ చేయను’ అని చెప్పాను. ఈ జనవరి 2వ తేదికి మేము మాట్లాడక రెండు సంవత్సరాలు గడిచిపోయింది. తను నన్ను వదిలి వెళ్లిపోయినప్పుడు మొదలైన వెలితి చదువు అయిపోయి ఉద్యోగం వచ్చినా అలానే ఉంది. ఈ రెండు సంవత్సరాలలో నేను నిన్ను డైరెక్ట్‌గా చూడకపోయినా భవిష్యత్‌లో ఎప్పుడన్నా చూస్తే నీ ముఖంలో చిరునవ్వుతో ఉంటావని కోరుకుంటున్నాను.
ఇట్లు
విజయ్


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు