ఈ సెలవుల్లో తనకు ప్రపోజ్‌ చేస్తా!..

12 Feb, 2020 16:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఓ రెండు కళ్లు నన్ను సంకెళ్లలా ఎటూ కదలనీయకుండా కట్టిపడేస్తాయని నేనెన్నడూ అనుకోలేదు. బస్‌లో మొదటిసారి తన కళ్లల్లోకి సూటిగా చూసేవరకు. ఆమె చూపు మరల్చినా నేనుమాత్రం ఆమె వైపు నుంచి నా చూపు తిప్పుకోలేకపోయాను. కొద్దిసేపటి తర్వాత ఎవరో పిలిచినట్లై వెనక్కుతిరిగాను. వెనకాల మా మామయ్య.. ‘ఏంట్రా ఊరికేనా?’ అడిగాడు. అవునని చెప్పా. మామయ్య నాతో మాట్లాడుతున్నా.. అవేవీ నాకు వినిపించటంలేదు. నా ధ్యాసంతా ఆమెమీదే ఉంది. ‘ ఊరొచ్చింది, ముందుకు పద’ అంటు దారి తీశాడు మామయ్య. నేను ఆమెకోసం వెతికాను. తను కూడా పుట్‌బోర్డు దగ్గరకు నడిచింది. అంటే తనది కూడా ఈ ఊరే అనుకున్నా మనసులో. తను ముందు నడుస్తుంటే మామయ్యతో పాటు నేను ఆమె వెకనాల నడుస్తున్నా. తన ఇళ్లు కూడా మామయ్యవాళ్ల ఇంటి దగ్గరే.

సాయంత్రం వరకు తన కోసం వాళ్ల ఇంటివైపు చూస్తూ ఉన్నా! కానీ, ఆమె బయటకు కూడా రాలేదు.  ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఆమె గురించే ఆలోచిస్తూ ఉన్నాను. తన పేరు భాను అని తెలుసుకోవటానికి రెండు రోజులు పట్టింది. కొద్దిరోజుల తర్వాత తనతో పరిచయం పెంచుకున్నాను. ప్రతిరోజూ బాగా మాట్లాడుకునే వాళ్లం. మా మధ్య స్నేహం పెరిగింది. ఆ రోజు ఊర్లో జాతర జరుగుతోంది. ఊరంతా చాలా సందడిగా ఉంది. వాళ్లిళ్లు మా ఇళ్లు బంధువులతో నిండిపోయాయి. మే​ము కలుసుకోవటానికి, మాట్లాడుకోవటానికి కుదరలేదు. ఆ రాత్రి ఊర్లో ఆర్కేస్ట్రా జరిగింది. అక్కడికి తను కూడా వచ్చింది. ఆ రాత్రి భానును చూస్తూ పాటలు వినడం కొత్తగా ఉంది.

తను కూడా నన్ను చూస్తోందన్న సంతోషం మరింత కొత్తగా ఉంది. ‘ కొంటె చూపుతో.. ఓ కొంటె చూపుతో .. నా మనసు మెల్లగా చల్లగా దోచావే..’ అంటూ మనసులో పాట పాడుకున్నా. నేను ఊర్లో ఉన్నన్ని రోజులు ఇట్టే గడిచిపోయాయి. భానుతో స్నేహం మరింత పెరిగింది. తనను వదిలి రావాల్సి వచ్చినపుడు చాలా బాధేసింది! అక్కడినుంచి కదలేకపోయాను. పోయిన సంక్రాంతి సెలవుల్లో నా ప్రేమ కథ మొదలైంది. తర్వాత ఆ ఊరు వెళ్లలేదు. ఈ సారి వేసవి సెలవులకు నా ప్రేమను ఆమెకు తెలియజేస్తా! కచ్చితంగా ఒప్పుకుంటుందని...
- వినయ్‌, కొత్తపేట

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు