ప్రేమ తపస్వి.. ‘మహిర్షి’

11 Nov, 2019 14:54 IST|Sakshi
మహర్షి రాఘవ, శాంతి ప్రియ

లవ్‌ సినిమా

సినిమా : మహర్షి( 1988)
తారాగణం : మహర్షి రాఘవ, శాంత్రి ప్రియ, సీవీఎల్‌ నరసింహ రావు, కృష్ణ భగవాన్‌
డైరక్టర్‌ : వంశీ

కథ : మహర్షి(మహర్షి రాఘవ) ఓ డబ్బున్న కుటుంబానికి చెందిన యువకుడు. తన మాటకు ఎదురు ఉండకూడదు, తాను అనుకున్నదే జరగాలనుకునే మనస్తత్వం గలవాడు. కాలేజీలో కొంతమంది ఫ్రెండ్స్‌తో గ్యాంగ్‌గా తిరుగుతూ ఎదురు తిరిగిన వారిని చితక్కొడుతూ అందర్ని బెదరగొడుతుంటాడు. అలాంటి వాడు తన మీద చేయిచేసుకున్న అమ్మాయి సుచిత్ర(శాంతి ప్రియ)తో ప్రేమలో పడతాడు. ఆమెను తన సొంతం చేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. తన పనులతో సుచిత్రను మెప్పించటానికి చూస్తాడు. అయితే సుచిత్ర అతన్ని అసహ్యించుకుంటుంది. వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడుతుంది. ఈ విషయం తెలిసిన మహర్షి ఆ పెళ్లిని ఆపుచేసి బలవంతంగానైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. మహర్షి, సుచిత్ర పెళ్లి ఆపుచేసి ఆమెను తన దానిని చేసుకుంటాడా? ఒకవేళ సుచిత్రకు పెళ్లయిపోతే మహర్షి ఎలా రియాక్ట్‌ అవుతాడు? అన్నదే మిగితా కథ.

విళ్లేషణ : 1988లో వచ్చిన మహర్షి ఆల్‌టైమ్‌ బెస్ట్‌ రొమాంటిక్‌ సినిమా. సినిమా పేరే నటుడి ఇంటి పేరుగా స్థిరపడిపోయిందంటే ఆ పాత్రలో మహర్షి రాఘవ ఎంతగా లీనమయ్యాడో చెప్పొచ్చు. సినిమా చూస్తున్నపుడు విఫల ప్రేమికుడు మహర్షి తప్ప మనకు రాఘవ కనిపించడు. ఈ సినిమాలో మిగితా నటులు పాత్రలుగా కాకుండా నిజజీవితాలుగా మనకు గుర్తుండిపోతారు. ఇళయరాజా సంగీతం మనల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు