అమ్మ వద్దంది. అమ్మాయిని వదులుకున్నా..

30 Jan, 2020 15:32 IST|Sakshi

నా పేరు మహేశ్‌. ఓ కోచింగ్‌ సెంటర్‌లో చూశాను అమృతని (పేరు మార్చాం) చూడటానికి చాలా యావరేజ్‌గా ఉంది కానీ నాకెందుకో చాలా బాగా నచ్చింది. నాకు అప్పటికే చాలా ప్రపోజల్స్‌ వచ్చాయి. మా కోచింగ్‌ సెంటర్లో కూడా కొంతమంది అమ్మాయిలు నన్ను ఇష్టపడేవాళ్లు అలా అందరినీ సిస్టర్‌ అని పిలిచేవాడ్ని, ఒక్క అమృతని తప్పా. అప్పుడే అర్థమైంది నా ఫ్రెండ్స్‌కి. అలా నన్ను బాగా ఆటపట్టించేవాళ్లు.  తను కూడా నాతో బాగా మాట్లాడేది. కోచింగ్‌ అయ్యాక ఫోన్‌ నెంబర్స్‌ తెలుసుకొని మాట్లాడుకునేవాళ్లం.

ఒకరోజు తనే మెసేజ్‌ చేసి తన లవ్‌ ప్రపోజ్‌ చేసింది. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. అలా మొదలైన మా ప్రేమ ఐదు సంవత్సరాలు చాలా సాఫీగా సాగింది. మా విషయం ఒకరోజు వాళ్లింట్లో తెలిసి అమృతని బాగా కొట్టారు. నాకు కాల్‌ చేసి వాళ్లింటికి పిలిచారు. చాలా టెన్షన్‌తో వెళ్లాను ఏం జరుగుతుందో అని. ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అనుకుంటే పెళ్లి చేసుకోండి మీ ఇంట్లో ఒప్పించి రా అన్నారు వాళ్ల నాన్న. చాలా సంతోషంగా ఇంటికి వెళ్లా ఇంక నా సైడ్‌ నుంచి ఒప్పిస్తే సరి అని.

కానీ మా అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. ఒకవేళ కాదని పెళ్లిచేసుకుంటే తన చనిపోతానంది. ఇంక నాకు ధైర్యం చాలలేదు. ఇంట్లో జరిగిన విషయాన్నంతా వాళ్ల నాన్నకి కాల్‌ చేసి చెప్పాను. ఆయన చాలా సింపుల్‌గా ఇక నుంచి మా అమ్మాయిని కలుసుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నన్ను అమృతని వార్న్‌ చేశారు. కట్‌ చేస్తే..తనకి పెళ్లి జరిగింది. మా అమ్మ తర్వాత అమ్మగా అనుకున్న అమృత నాకు దూరమైంది. తను నాకు దూరమై 18 నెలలు అవుతుంది ఈ మద్యకాలంలో నేనెంత క్షోభను అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. అమ్మప్రేమను వదులుకోలేక అమ్మాయి ప్రేమను చంపుకోవాల్సి వచ్చింది. అప్పడు తెలియలేదు ఇది నన్ను ఇంత దహిస్తూ ఉంటుందని. చివరగా..నువ్వు ఎక్కుడున్నా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

--మహేశ్‌, కాకినాడ.

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు