50 మంది ముందు చెప్పలేకపోయా... కానీ ఇప్పుడు!

20 Jan, 2020 14:35 IST|Sakshi


నా  పేరు శ్రీకాంత్‌. నేను ఓ కాలేజీలో బీఫామ్‌ చదువుతున్నాను. ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఒక మధురమైన అనుభూతి. కానీ అది నా జీవితంలో మోయలేక మోస్తున్న ఒక భారం. నేను ఆ కాలేజీకి ఇష్టం లేకుండా అయిష్టంగానే వెళ్లాను. కానీ  మా కాలేజీలో నా ర్యాంక్‌ ప్రకారం నేనే టాపర్‌ను. అంతేకాదు నేనే క్లాస్‌ సీఆర్‌గా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. దీలీప్‌ అనే ఒక ఫ్రెండ్‌ ద్వారా తన అల్లరి
గురించి విన్నాను. ఒక రోజు మా క్లాస్‌ అందరికి కలిపి ఫేస్‌బుక్‌లో ఒక గ్రూప్‌ ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్‌లో ఫ్రెండ్స్‌ ద్వారా యాడ్‌ అయిన తను వెంటనే నాకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టింది. అప్పటి నుంచి రోజు రాత్రి 2
వరకు చాట్‌ చేసుకునేవాళ్లం. 

తను నాకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టక ముందు తన పేరుతో నేనే ఫేక్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి మా ఫ్రెండ్‌ రోహిత్‌కు రిక్వెస్ట్‌ పెట్టాను. వాడితో సరదాగా ఆడుకునేవాడిని. తను పరిచయం అయిన తరువాత తప్పు
తెలుసుకొని ఇద్దరికీ నిజం చెప్పేశాను. ఆ సంఘటనతో మా ఇద్దరికి మరింత పరిచయం పెరిగింది. ఈ లోపు ఎలా మరిందో తెలియదు కానీ పరిచయం కాస్తా తన మీద ప్రేమగా మారింది. ఒక రోజు ధైర్యం చేసి
తనకు ప్రపోజ్‌ చేశాను. ఆ తరువాత ఒక వారం రోజుల వరకు మా మధ్య మాటలు లేవు. 

 ఆ తరువాత ఒక పోలియో క్యాంప్‌ ద్వారా మా మధ్య బంధం​ మరింత పెరిగింది. అది ఎంత అంటే చాట్‌ చేసుకోవడం నుంచి కాల్‌ చేసుకునే వరకు. ఇద్దరం క్లాస్‌ బంక్‌ కొట్టి మరీ ఫోన్స్‌ మాట్లాడుకునే వాళ్లం.
ఒకసారి మేమిద్దరం మా దగ్గరలో ఉండే టెంపుల్‌కు కూడా వెళ్లాము. మా ఫ్రెండ్‌ ఒకడు తన గురించి బ్యాడ్‌గా కామెంట్‌ చేస్తే నేను మా ఫ్రెండ్‌ కలసి వాడిని కాలేజీ వాష్‌రూమ్‌లో కొట్టాము.  ఇంతలో నా
పుట్టినరోజు వచ్చింది. తను రాత్రి 12 ఇంటికి కాల్‌ చేసి నాకు విష్‌ చేసి కొరియన్‌ భాషలో ఐ లవ్‌ యూ చెప్పింది. నా ఆనందానికి అవధులు లేవు. కానీ ఆ తరువాత రోజు తను ఫోన్‌ చేసి కేవలం నీ పుట్టిన రోజు
నాడు నువ్వు ఆనందపడతావని అలా చెప్పాను అంది. నేను తను సిగ్గుపడి అలా చేసింది ఏమో అనుకున్నాను. ఇంతలో మా ఎగ్జామ్స్‌ దగ్గర పడ్డాయి.నేను టాపర్‌ కావడంతో నైట్‌ నేను చదివి తనకు అన్ని అర్దం అయ్యేలా చెప్పేవాడిని.

ఆ తరువాత వచ్చిన మా సెమ్‌ ఎగ్జామ్స్‌ టైంలో మాకు చిన్న గొడవ అయ్యింది. అది చిలికి చిలికి గాలి వాన అయ్యింది. అప్పుడు బ్రేక్‌ అయిన రిలేషన్‌ ఇప్పటి వరకు కలవలేదు. తను సారీ చెప్పడానికి కాల్‌ చేసింది. నేను ఆ టైంలో తాగి ఉండటం వల్ల తనని చాలా తిట్టేశాను. అంతే మా ఫస్ట్‌ ఇయర్‌లో అయిన ఆ గొడవ వల్ల విడిపోయిన మేము ఇప్పుడు మా ఫైనల్‌ ఇయర్‌ అయిన ఇంకా కలవలేదు.
నాకు ఇప్పటి వరకు 6 బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయి. 5 సార్లు కాలేజీ నుంచి సస్పెండ్‌ అయ్యాను. తాగి క్లాస్‌కు వెళ్లడం,  లెక్చలర్స్‌తో దురుసుగా ప్రవర్తించడం వల్ల అలా జరిగింది. ది మోస్ట్‌ ఫనియస్ట్‌ గయ్‌ నుంచి ది
మోస్ట్‌ ఫ్రస్టెటెడ్‌ గాయ్‌ గా నా ఫ్రేమ్‌ మారిపోయింది.

తన ప్రేమ కోసం అలా 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. తన కోసం మా ప్రేమను సినిమాగా తీయాలనుకుంటున్నాను. ఇంకొన్ని నెలల్లో ఆ సినిమా తీస్తాను. ఇంకో మూడు నెలల్లో మా ఫైనల్‌ ఇయర్‌ అయిపోతుంది. నా కళ్లు మళ్లీ ఆమెను చూడలేవు. నా మనసు ఆమె నవ్వును, చెవులు ఆమె స్వరాన్ని వినలేవు. నా ఈ అలుపెరుగని ప్రేమకు ముగింపు పడనుంది.ఈ సందర్భంగా నా బాధలో, నా నవ్వులో తోడున్న నా ఫ్రెండ్స్‌ అందరికి ధన్యవాదాలు.  

ఫైనల్‌గా నీకు ఓ మాట చెప్పాలనుకుంటున్నా మన మొదటి ఫేస్‌బుక్‌ పరిచయం, ఆ తరువాత చాట్‌, ట్రూత్‌ ఆర్‌ డేర్‌ గేమ్‌, టెంపుల్‌కు వెళ్లడం, చిలకజోస్యం, ఎగ్జామ్స్‌, సీనియర్‌తో నీ గొడవ, వాష్‌ రూంలో నా
గొడవ, నేను నీ బర్త్‌డే కి ఇచ్చిన గిఫ్ట్‌,  నా బర్త్‌డేకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్‌( వాల్ముతే కొరియన్‌లో ఐ లవ్‌ యూ), గురు సినిమాకు వెళ్లి సినిమా చూడకుండా ఇంటర్వెల్‌ వరకు సినిమా చూడకుండా నీతో మాట్లాడుతూ గడిపిన ఆ రోజు, నేను నీకు చేసిన ప్రపోజల్‌, ఇచ్చిన లవ్‌ లెటర్‌, టెంప్టెషన్‌ ఆల్మండ్‌, మీ ఫ్రెండ్‌గా నాకు పరిచయమయిన మన జూనియర్‌, తనతో ముచ్చట్లు, బసూది, మార్చుకున్న మన క్యారెక్టర్స్‌, ఫైనల్‌గా మన గొడవ... అన్ని అలా నా కళ్ల ముందు కదులుతూ ఇంకొన్ని రోజులే నేను నిన్ను చూసేది అని గుర్తుచేస్తూ నా కళ్లు తడుపుతున్నాయి.మళ్లీ నేను నీకు ఈ మాట ‘సాక్షి’ సాక్షిగా చెపుతున్నా అప్పుడు 50 మంది ముందు చెప్పలేకపోవచ్చు, ఇప్పుడు ఈ పేపర్‌ చదివే లక్షల మంది సాక్షిగా చెబుతున్నా ఐ లవ్‌ యూ ఫర్‌ ఎవర్‌ మహి. 

శ్రీకాంత్‌( మంగళగిరి). 


 

మరిన్ని వార్తలు