వాలెంటైన్స్‌ డే మరింత అందంగా

7 Feb, 2020 15:01 IST|Sakshi

సాధారణంగానే ప్రేమికులు సందర్భం లేకుండానే  బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులంతా ఎదురుచూసే వాలెంటైన్స్‌డేని మరింత అందంగా, మదుర ఙ్ఞాపకంలా మలుచుకునేందుకు ప్రేమికులంతా గిఫ్ట్‌లతో రెడీ అయిపోతుంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన బహుమతులు ఇచ్చి తమవారిని ఇంప్రెస్‌ చేస్తుంటారు. వాటిలో ప్రత్యేకంగా వాలెంటైన్స్‌ డేకి ఇచ్చిపుచ్చుకునే మోస్ట్‌ పాపలర్‌ గిఫ్ట్స్‌ ఏంటో ఓసారి తెలుసుకుందాం. 

1. రోజా పువ్వు : ప్రేమను వ్యక్తపరచడానికి దాదాపు ఎనభై శాతం ప్రేమికుల మొదటి ఛాయిస్‌ రోజా పువ్వేనట. రోజా పువ్వులోనూ రకరకాల రంగులున్నా ఎర్ర గులాబీకే ఎక్కువ మక్కువ చూపుతారు. 

2. చాక్లెట్స్ ‌: వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఇష్టపడేది చాక్లెట్స్‌. వాలెంటైన్స్‌డే సందర్భంగా ప్రతీ ఒక్కరి గిఫ్ట్‌ బాక్స్‌లలో ఉండే  కంపల్సరీ ఐటెమ్‌. చాక్లెట్‌లోని తీపిదనంతో ఆ బంధం మరింత దృఢంగా మారుతుందనేది ప్రేమికుల నమ్మకం. 

3. రింగ్ ‌: తాము ప్రేమించినవారి ముందు మోకాళ్లపై కూర్చొని వారి చేతిని దగ్గరగా తీసుకొని ఉంగరాన్ని తొడుగుతూ ప్రేమను వ్యక్తపరుస్తారు. పట్టుకున్న చేతిని వదలకుండా జీవితాంతం వారికి తోడుగా నిలుస్తామని భరోసానిస్తూ ప్రపోజ్‌ చేస్తారు. ఇలా ప్రపోజ్‌ చేస్తే అమ్మాయిలు త్వరగా ప్రేమను అంగీకరిస్తారని ఓ సర్వేలో తేలింది.

4. వ్రిస్ట్‌ వాచ్‌ : తమ మనసుకు నచ్చినవారికి అమ్మాయిలు ఎక్కువగా వాచ్‌ ఇవ్వడానికి ఇష్టపడతారు. అబ్బయిలకి గిఫ్ట్స్‌ ఇ‍వ్వడానికి చాలా తక్కువ ఆఫ్షన్స్‌ ఉంటాయి. వాటిలో వాచీలదే ప్రథమ స్థానం. అంతేకాకుండా చేతికి ఉండే గడియారం అనుక్షణం తమను గుర్తుచేస్తూ ఉంటుందని ఉద్దేశంతో చాలామంది అమ్మాయిలు వాచ్‌లను ఇవ్వడానికి మక్కువ చూపిస్తుంటారట. 

5.  టెడ్డీబేర్‌ : చూడటానికి చాలా క్యూట్‌గా, అందంగా ఉండే టెడ్డీస్‌ అంటే ఇష్టపడని మగువ ఉండదు. అందుకే తమ ప్రేయసిని ఇంప్రెస్‌ చేయడానికి చాలామంది అబ్బయిలు టెడ్డీ బేర్‌లను గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు. తాము వారి పక్కన లేకున్నా వారున్నట్లుగా భావించి మనసులో మాటలు చెప్పుకోవడానికి టెడ్డీబేర్‌ బెస్ట్‌ ఛాయిస్‌ 

6. కాఫీ మగ్‌ : ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగనిదే మత్తు వదలదు చాలామందికి. ఉదయం లేవగానే తాము గుర్తొచ్చేలా ఉండేందుకు చాలా మంది కాఫీ మగ్‌లను గిఫ్ట్‌ చేస్తుంటారు. వీటిలో చాలా రకాలున్నాయి. వాళ్ల అభిరుచికి తగ్గట్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎంచుకుంటుంటారు. 

7. గాగుల్స్‌ : బయటికి వెళ్లాలంటే కాలంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరి ఆల్‌టైం ఫేవరెట్‌ ఛాయిస్‌ గాగుల్స్‌.  సో వారి ప్రేమించినవారికి గాగుల్స్‌ ని గిఫ్ట్ గా ఇస్తుంటారు.

8.  సెల్‌ఫోన్‌ : సెల్‌ఫోన్‌ ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. అందుకే తమ జీవిత భాగస్వామికి సెల్‌ఫోన్‌ ఇచ్చి సర్‌ఫ్రైజ్‌ చేస్తుంటారు చాలా మంది ప్రేమికులు. తమతో గడిపిన ప్రతీ క్షణాన్ని మధురానుభూతిగా మలచుకోవడానికి సెల్‌ఫోన్‌లో బందిస్తుంటారు. 

9. మేకప్‌ సెట్‌ : ప్రతీ అమ్మాయి తన అందానికి మరింత మెరుగులు దిద్దేందుకు మేకప్‌ను ఉపయోగిస్తుంటారు. సందర్భానికి తగ్గట్లు వారి అలంకరణలో మార్పులు చేసుకుంటూ మరింత అందంగా కనబడేందుకు సిద్దమతుంటారు. ఇక వాలెంటైన్స్‌ డే న వారికి ఎంతో ఇష్టమైన మేకప్‌సెట్‌ గిఫ్ట్‌గా ఇస్తే అమ్మాయిలు ఫుల్‌ ఖుష్‌ అవుతారు.

10. పరఫ్యూమ్‌ : పర్‌ఫ్యూమ్‌ మన ఆలోచనలపై చాలా ప్రభావం చూపుతుంది. అయితే లైట్‌ స్మెల్లింగ్‌ పర్‌ఫ్యూమ్స్‌ని చాలా మంది ఇష్టపడుతుంటారు. మంచి సువాసనాభరితమైన పర్‌ఫ్యూమ్‌ తమ వారిని ఆకర్షించుకునేందుకు మరో సున్నతిమైన ఆయుధం లాంటిదని చెప్పొచ్చు. 

11. గ్రీటింగ్‌ కార్డ్‌ : ఏ చిన్న వేడుక జరిగినా గ్రీటింగ్‌ కార్డు  ఇవ్వడం సాధారణంగా చూస్తుంటాం.  గ్రీటింగ్‌ కార్డుల్లోనూ అకేషన్‌కి తగ్గట్లు చాలా వెరైటీస్‌ ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా తమ ప్రేమికుల కోసం స్వయంగా వారే గ్రీటింగ్‌ కార్డులను రూపొందించవచ్చు. అది కూడా  చాలా సులభమైన పద్దతిలో. సో మీరు ప్రేమించేవారికోసం కొంత సమయం కేటాయించి గ్రీటింగ్‌కార్డును మీరే అందంగా తీర్చిదిద్దవచ్చు. మీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలతో హ్యండ్‌ క్రాఫ్ట్‌ ఇచ్చినా బావుంటుంది. 

మరిన్ని వార్తలు