తనది చిన్నపిల్ల మనస్తత్వం!

30 Jan, 2020 15:11 IST|Sakshi

నా పేరు కన్నా. నాకు స్కూల్‌ డేస్‌లో ఒక లవ్‌ స్టోరీ ఉండేది.అది మర్చిపోతున్న సమయంలో స్టడీస్‌ కోసం ముంబాయ్‌కు వెళ్లాం. అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. 7 సంవత్సరాల ఫ్రెండ్‌షిప్‌ తరువాత అది అలా అలా లవ్‌ దాకా వెళ్లింది.  అది కూడా నా వైపు నుంచే. ఆమెతో ఉన్న ఫ్రెండ్‌షిప్‌ కారణంగానో లేదో నా అమాయకత్వం వల్లనో నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలి అనిపించింది. ఆమెకు క్లారిటీ లేకపోవడం వల్ల  నేను రోజుకు ఒక యుద్దం చేయాల్సి వచ్చేది. 2 సంవత్సరాల క్రితం నేను పార్క్‌లో ఆమెకు ప్రపోజ్‌ చేశాను. తను నేనంటే ఇష్టం లేదని నా ముఖం మీద చెప్పింది. ఇంకా ఏం చేస్తాను ఏడ్చుకుంటూ వచ్చేశాను. తరువాత 2017లో నాకు నువ్వు కావాలి అని మెసేజ్‌ చేసింది. తరువాత మళ్లీ 6 నెలల తరువాత మళ్లీ సేమ్‌ నాకు నువ్వు వద్దు మా నాన్నకి ఇష్టం లేదు అని చెప్పింది. అప్పుడు నేను డిప్రెషన్‌లో గుండు కొట్టించుకున్నాను. నా మీద నాకే అంతలా అసహ్యం వేసింది. 

మళ్లీ 2019లో సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. మళ్లీ నేను ఓకే చెప్పాను. ఈసారి మా ప్రేమ ఎంగేజ్‌మెంట్‌దాకా వచ్చింది. నా లైఫ్‌లో క్లైమాక్స్‌ అదే. కొన్ని కారణాల వల్ల మా పెళ్లి ఒక నెల ముందు ఆగిపోయింది. రీజన్‌ వింటే నవ్వు ఏడుపు రెండూ వస్తాయి. ఎవరో చెప్పిన మాటలు విని పెళ్లి వద్దు అని చెప్పింది. ఇదంతా అయ్యాక లాస్ట్‌ ఇయర్‌ నుంచి మళ్లీ డిప్రెషన్‌. నా జీవితంలో ఆనందం కంటే డిప్రెషనే ఎక్కువ అని నా ఫీలింగ్‌. నా లైఫ్ ఎందుకు ఇలా అయ్యింది అని ఏడవని రోజు లేదు. 7 సంవత్సరాల నుంచి ఒకే అమ్మాయి అన్ని తనే అనుకొని ఉన్నాను. ఇప్పుడు ఇలా అయ్యింది. తనకు క్లారిటీ లేకపోవడం వల్లే ఇలా జరిగింది. లేకపోతే ఎవరు ఎన్ని చెప్పినా ఇలా జరిగేది కాదు. 


 ఇలా జరిగి సంవత్సరం అయ్యింది.కానీ ఇప్పటికీ నేను ఆమెను ప్రేమిస్తున్నాను. కానీ ప్రయోజనం లేదు. ఆమెది పిల్లల మనస్తత్వం, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది. ఏదో ఒక రోజు మెసేజ్‌ చేస్తుంది అనే నమ్మకంతో అలానే ఉన్నాను. మా ఇంట్లో వాళ్లు నన్ను ఇంకా పెళ్లి చేసుకో అంటున్నారు. నాకేము ఇప్పటివరకు చేసిన స్టంట్‌లు చాలు అనిపిస్తోంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇంకా మా అమ్మ నాన్న నాకు ఒక మంచి ఆఫర్‌కూడా ఇచ్చారు. నేను ఎవరిని లవ్‌ చేసిన వాళ్లకి ఎలాంటి ఇబ్బంది లేదు అని. కానీ నా ముఖానికి ఎవరు పడతారు చెప్పండి ( చూడటానికి బాగానే ఉంటాలే). కానీ ఏ అమ్మాయితో మాట్లాడిన అక్క, చెల్లి అనేవాడిని. అందుకే నా లైఫ్‌లో అక్క చెల్లెళ్లు తప్ప లవర్‌లు, క్రష్‌లు ఏం ఉంటారు చెప్పండి. నా లైఫ్‌ ఒక జోక్‌. నా జీవితం మీద 1000 ఎపిసోడ్‌లు తీయ్యెచ్చు, అన్ని ట్వీస్ట్‌లు ఉంటాయి. అయినా కూడా ఆ దేవుడికి నా మీద జాలి కలగడం లేదు. బయటకు వెళ్లిపోదాం అని వీసా అప్ల చేస్తే రెండుసార్లు రిజెక్ట్‌ అయ్యింది. 

చెప్పడం మర్చిపోయాను, మొన్నిమధ్య ఒక అమ్మాయి వచ్చి నేనంటే ఇష్టం అని చెప్పింది. నేను ఇంకా నా లైఫ్ లో ట్విస్ట్‌లు చాలు అక్క అని చెప్పాను. అందరికి ఒకే ఒక గమనిక ఏదో సినిమాలో అన్నట్లు లైఫ్‌ అందరి దూలా తీర్చేస్తుంది భయ్యా ఎవరిని వదలదు, ఇది మాత్రం పక్కా. ఇప్పుడు నా వయస్సు 28. ఒక పక్క ఫ్యామిలి గొడవలు, ఇంకొ పక్క నా దురదృష్టం. ఇంకా ఎన్నెళ్లో ఇలా. నాకు కూడా మంచి రోజులు వస్తాయిలే అనే నమ్మకంతో రోజు లేస్తున్నాను. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయే వాడిని. అయినా చచ్చి పోయి ఏం సాధిస్తాం, అమ్మనాన్నలను ఏడిపించడం తప్ప.  నాలా ఎవరైనా డిప్రెషన్‌లో ఉంటే మా లాగే ఇంకో వెదవకూడా ఉన్నాడు అని నవ్వుకుంటూ ధైర్యంగా ఉంటారని ఈ లెటర్‌ రాస్తున్నాను. 
ఇట్లు, 
మీ తెలుగోడు( ముంబాయి).

మరిన్ని వార్తలు