తను ఎందుకలా చెప్పిందో అర్థం కాలేదు!

18 Dec, 2019 12:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేను పీజీలో ఉన్నపుడు ఒక అమ్మాయిని లవ్‌ చేశా. ఆరు నెలలు తనకోసం ఎదురు చూశా. నా గురించి తనకెవరో చెప్పారంటా. అప్పటినుంచి నన్ను దూరం పెట్టడం ప్రారంభించింది. తర్వాత అడిగా ‘ఎందుకు నన్ను దూరం పెడుతున్నావ్‌’ అని. అప్పుడు తను‘ నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు.’ అని చెప్పింది. నాతో మాట్లాడటం మానేసింది. నాకు చాలా బాధేసింది. కానీ, మా ఫ్రెండ్స్‌తో బాగా మాట్లాడేది. సరే ఇంక ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకని పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వటం మొదలుపెట్టా. ఎక్షామ్స్‌ తర్వాత సమ్మర్‌లో బెంగళూరు వెళ్లాను. అక్కడ ఓ చిన్న కంపెనీలో జాబ్‌ చేసుకుంటున్నా. 9-8-2019 రోజు అన్‌నౌన్‌ నెంబర్‌నుంచి ఫోన్‌ వచ్చింది. ఎవరో అని మాట్లాడా! అది తను. ఎందుకు ఫోన్‌ చేశావు అని అడిగాను. ‘నువ్వు నాకు ప్రపోజ్‌ చేయగానే నాకు భయం వేసింది.

అందుకే నేను కుదరదన్నాను’ అని చెప్పింది. ‘మరి ఇప్పుడు భయం లేదా’ అని అడిగాను. ఏంలేదని చెప్పింది. ఆరు నెలలుగా టైం దొరికినప్పుడల్లా కాల్‌ చేసేది. సడెన్‌గా ఓ పదిరోజులనుంచి ఫోన్‌ చేయటం లేదు. సరే అని నేనే తనకు ఫోన్‌ చేశా. అప్పుడు అంది ‘ ఇక మీదట నాకు ఫోన్‌ చేయకు. నేను నీతో మాట్లాడను’ అని చెప్పింది. తను ఎందుకలా చెప్పిందో నాకు ఇంతవరకు అర్థం కావటం లేదు. 
-నాగేష్‌, పలమనేర్‌

చదవండి : వైకల్యం వారి ప్రేమకు అడ్డుకాలేదు
పెళ్లి చేసుకోకపోతే బ్లాక్‌ మెయిల్‌ చేస్తావా?..



లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు