నేను కాదంటే చనిపోతానంది.. చివరకు..

25 Nov, 2019 10:11 IST|Sakshi

నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను. డ్రైవింగ్‌ చేసుకుంటా ఫ్యామిలీకి సపోర్టుగా ఉండేవాడ్ని. పని చేసుకుంటూనే డిగ్రీ చదువు పూర్తి చేసుకున్నా. ఆ తర్వాత ఎంబీఏ కోసం తిరువూరులో ఫ్రీ అడ్మిషన్‌ సీటు వచ్చింది. అక్కడ 20 బస్సులు ఉన్నాయి. కరెస్పాండెంట్‌ సార్‌తో నాకు డ్రైవింగ్‌ వచ్చని, హెవీ లైసెన్సు కూడా ఉందని, జాబ్‌ ఇవ్వండని అడిగా. వాళ్లు డ్రైవింగ్‌ టెస్ట్‌ చేసి 6వేల శాలరీతో పాటు ఎంబీఏ అడ్మిషన్‌ ఇచ్చారు. ఎంబీఏ కంప్లీట్‌ అయ్యే సమయంలో నా బస్‌లో జర్నీ చేసే ఒక అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నట్లు చెప్పింది. నేను ఆలోచించుకుని చెప్తానన్నాను. ఓ వారం ఆగి, ‘ఏముంది నా దగ్గర.. పేద కుటుంబం. మీరు డబ్బున్నవారు. నా దగ్గరకు వస్తే సరిగా ఉండలేవు’ అని చెప్పాను.

అయినా తను వినలేదు. పెళ్లంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని లేకుంటే చస్తానని బెదిరించింది. చేసేది ఏమీ లేక అమ్మానాన్నలకు చెప్పి, పోలీస్‌ స్టేషన్‌లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి పేరెంట్స్‌కు ఈ మ్యారేజ్‌ ఇష్టం లేదు. పెళ్లైన తర్వాత ఆమెను హ్యాపీగా ఉంచటం కోసం కూలీ పనులకు వెళ్లాను, జాబ్‌లు ట్రై చేశాను. ఆరు నెలల తర్వాత వాళ్ల అమ్మానాన్నలు వచ్చి ‘అందరం కలిసి ఉందాం. అమ్మాయి గర్బవతి కదా! ఆసుపత్రిలో చూపించి పంపుతాం’ అన్నారు. నేను వాళ్ల మాటలు నమ్మి వాళ్లతో పంపించాను. రెండు రోజుల తర్వాత ఆమె నెంబర్‌ కలువలేదు. వాళ్ల ఊరికి వెళితే ఊరు విడిచి వెళ్లిపోయారని తెలిసింది.

ఆ సమయంలో నా పరిస్థితి వర్ణనాతీతం. ఆమెకోసం చాలా ట్రై చేశాను, ఆమె కోసమే బ్రతికాను. అలాంటిది ఒక సంవత్సరం తర్వాత నా మీద పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ చేసింది. ‘వాడికి నాకు సంబంధం లేదు. నాకు డైవర్స్‌ కావాలి’ అని అంది. ఆ టైంలో నాకు చావాలనిపించింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నపుడు మా అమ్మానాన్నలు గుర్తుకు వచ్చారు. నేను చనిపోతే వాళ్లకు ఎవరూ ఉండరని ఆలోచించి. ఆమెను మర్చిపోవటం స్టార్ట్‌ చేశాను. ఆ తర్వాత అమ్మానాన్నలకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఒక ఫార్మసీ కంపెనీలో జాబ్‌ కూడా వచ్చింది.  ఇప్పుడు నేను, నా భార్య, నా కొడుకు, అమ్మానాన్న అందరం సంతోషంగా ఉన్నాము.
- నాగూల్‌ మీరా షేక్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

>
మరిన్ని వార్తలు