ప్రేమకు నియమాలు వర్తించవు

6 Nov, 2019 12:25 IST|Sakshi
ఓం శాంతి ఓషన చిత్రంలోని ఓ దృశ్యం

లవ్‌ సినిమా

సినిమా : ఓమ్‌ శాంతి ఓషన
తారగణం : నివిన్‌ పాలీ, నజ్రియా నజీమ్‌
డైరక్టర్‌ : జుడే ఆంథనీ జోషఫ్‌
భాష : మలయాళం

కథ : పూజ మాథ్యూ (నజ్రియా నజీమ్‌) తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతరు. అతి గారాబంతో టాంబాయ్‌ లాగా పెరిగిన పిల్ల. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు పెళ్లి విషయంలో ఓ నిర్ణయానికి వస్తుంది. పరిచయంలేని వ‍్యక్తిని పెళ్లి చేసుకుని బాధపడటం కంటే తెలిసిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే మంచిదని అనుకుంటుంది. కానీ, పరిచయం లేని వ్యక్తి గిరి మాధవన్‌(నివిన్‌ పాలీ)తో తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది. అతడ్ని ఇంప్రెస్‌ చేయటానికి సతవిధాల ప్రయత్నిస్తుంది. అప్పుడే గిరి లవ్‌ ఫేయిల్యూర్‌ అన్న సంగతి తెలుస్తుంది. అయినా తన ప్రయత్నాన్ని మానదు. టాంబాయ్‌ చేష్టలనుంచి మామూలు అమ్మాయిగా మారిపోతుంది.

పూజలో వచ్చిన మార్పుకు ఆమె తల్లిదండ్రులే ఆశ్చర్చపోతారు. ప్రతిరోజూ గిరి చుట్టూ తిరిగినా అతడితో ఎక్కువగా మాట్లాడలేకపోతుంది. ఓ రోజు ధైర్యం చేసి తన ప్రేమను చెప్పటానికి ప్రయత్నిస్తుంది. అయితే పూజ తనని ప్రేమిస్తోందన్న విషయం తెలిసిన గిరి ఆమె ప్రేమను సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇద్దరి మతాలు వేరని, వయసుల మధ్య కూడా చాలా తేడా ఉందంటూ తనను మరిచిపోమని చెప్తాడు. గిరి తిరస్కారంతో పూజ అతడ్ని మరిచిపోతుందా? లేక పట్టువదలకుండా ప్రయత్నించి ప్రేమను సాధించుకుంటుందా? లేదా? అన్నదే మిగితా కథ.

విశ్లేషణ : 2014లో విడుదలైన ఈ సినిమా ఓ మంచి రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. అమ్మాయి వైపు నుంచి సాగే ప్రేమ కథ ఇది. తొలి ప్రేమను దక్కించుకోవటానికి అవస్థపడే అమ్మాయిగా నజ్రియా నటన మెప్పిస్తుంది. ప్రేమలో, యుద్ధంలో నియమాలు వర్తించవనటానికి పూజ పాత్ర నిదర్శనంగా నిలుస్తుంది. ప్రేమ భావాలకు భాషతో పనిలేదనకుంటే ప్రేమికులు తప్పక చూడాల్సిన సినిమా ఇది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు