అసలు నేనెవరో తనకి తెలుసా? లేదా?

28 Feb, 2020 20:41 IST|Sakshi

తన పేరు శిల్పా. నేను 6 వ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి ఆమెను చూశాను. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె అందమైన ముఖం నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తోంది. తనని ప్రతి రోజు ఇంటికి వెళ్లేటప్పుడు ఆమెకు తెలియకుండా  ఫాలో అయ్యేవాడ్ని. నాకు పేవర్‌గా ఉండే ఒక సార్‌ నన్ను క్లాస్‌ లీడర్‌గా చేశారు. తనని కూడా చేశారు. నాకు ప్రతి రోజు తనని చూడటమే సరిపోయేది. కానీ ఎప్పుడు నా ఫీలింగ్స్‌ చెప్పలేదు. వాళ్ల ఇంటి చుట్టూ తిరుగుతున్నని మా నాన్న నన్ను వేరు స్కూల్‌లో చేర్చించారు. తను మాత్రం గవర్నమెంట్‌ స్కూల్‌లో ఉండిపోయింది. నేను ప్రతి రోజు స్కూల్‌ నుంచి రాగానే తనని చూసే వరకు నిద్రపోయే వాడ్ని కాదు. తను ట్యూషన్‌లో చేరిందని తెలిసి నేను కూడా అదే ట్యూషన్‌లో చేరాను. కానీ తను ఎప్పుడు నన్ను పట్టించుకోలేదు.   

మా 9వ తరగతిలో తను కూడా ఏదో ప్రైవేట్‌ స్కూల్‌లో చేరింది. నేను రోజు వాళ్ల హాస్టల్‌ దగ్గరకు వెళ్లిన తను కనిపించేది కాదు. ప్రతి రోజు బాధపడే వాడ్ని. ఇంటర్‌కు వెళ్లాక తన కాలేజ్‌ చుట్టూ తిరుగుతూ ఉండేవాడ్ని. కానీ నేను తన చుట్టూ తిరుగుతున్న ఒక్కసారి కూడా తనకి ఆ విషయం తెలిసేది కాదు. ఎన్నోసార్లు ప్రయత్నించా నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి కానీ ఊర్లో తెలిస్తే గొడవలు అవుతాయని భయంవేసేది. తన ఊరు వచ్చినప్పుడల్లా నేను వాళ్ల ఇంటివైపు ఏదో పని వంకతో వెళ్లి చూసి వచ్చేవాడ్ని. అలాగే ఒక్కసారి అయినా నాతో మాట్లాడుతుందేమో అనే ఆశతో 2002 నుంచి 2017 వరకు తన చుట్టూ తిరిగాను. కానీ నా బ్యాడ్‌ లక్‌ నేను నా ప్రేమ విషయం తనకు చెప్పకుండానే తనకు పెళ్లి అయిపోయింది. కానీ నేను ఇప్పటికీ తనని ఒక దేవతలానే చూస్తాను. నేను చచ్చేలోపు ఒక్కసారి అయినా నేను నీతో మాట్లాడాలి శిల్ప ప్లీజ్‌. నేను అసలు ఎవరో తనకి తెలుసా లేదో అనే విషయాన్ని ఒక్కసారి తనని అడగాలనుంది. ఒకే ఒక్క మాట నేను నీకు తెలుసా అని అడగాలి అని చాలా సార్లు అనిపిస్తుంది. తనని మొదటిసారి చూసిన ఆ క్షణం తన ముఖం ఎప్పుడూ నాకు గుర్తువస్తూనే ఉంటుంది. అది తల్చుకున్నప్పుడల్లా నా ముఖం మీద చిరునవ్వు వస్తుంది. శిల్ప ఈ మెసేజ్‌ నువ్వు చూస్తే ఒక్కసారి నాతో మాట్లాడు. ఇది నువ్వు గుర్తుపట్టాలి అనుకుంటే ఒక హింట్‌ ఇస్తాను నీకు అరవ తరగతిలో ఉన్నప్పుడు ప్రతిమ, గీత అనే ఫ్రెండ్స్‌ ఉన్నారు. ప్లీజ్‌ శిల్ప నువ్వు గుర్తుపడితే ఒక్కసారి నాతో మాట్లాడు. 
ఇట్లు
కుమార్ ‌(పేరు మార్చాం)
ఒంగోలు.
 

మరిన్ని వార్తలు