ఆమె లేని లోటును పూడ్చలేకున్నా

13 Nov, 2019 15:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఓడిపోవటమే తెలిసిన నాకు తనను చూడగానే ఫస్ట్‌ టైమ్‌ గెలవాలనిపించింది. తనతో ఫ్రెండ్‌షిప్‌ చేయడానికి చాలా ట్రై చేసి చివరకు గెలిచాను. కానీ, మా మధ్య ఉన్నది స్నేహం మాత్రమే కాదు, అని చెప్పాలనుకున్నాను. తన కళ్లలోకి చూసి మాట్లాడలేని నేను ఎలా చెప్పాలో తెలీక ‘నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనుకు ఎలా చెప్పాలో తెలియటం లేదు’ అని తనను లవ్‌ చేస్తున్న స్టోరీని తనతోనే షేర్‌ చేసుకునేవాడిని. తను ‘మీ లవ్‌ నిజమైంది. తప్పకుండా మీ ప్రేమ సక్సెస్‌ అవుతుంది’ అని అంటే నాలో నేను ఎంతో సంతోషపడిపోయేవాడిని. ఒక రోజు ఓ మెసేజ్‌ వల్ల నేను లవ్‌ చేస్తోంది తననే అని తెలిసి నాతో గొడవపడింది. తను కోపంగా మాట్లాడే ప్రతి సారి నన్ని నేను తిట్టుకునే వాడిని. చివరికి నీతో ఓ ఫ్రెండ్‌లా.. నీ పెళ్లి అయ్యే వరకు ఉంటాను. అనే ఒప్పందం మీద మా స్నేహం మళ్లీ చిగురించింది. తను నాతో లేని మూడు సంవత్సరాలు మత్తుకు బానిసై గడిపేశా.

అనుకోకుండా ఓ రోజు మెసేజ్‌ చేస్తే కలిసింది. ఒకగంట మా మధ్య మాటల్లేవు. తను మాట్లాడాలని చూసిన నా మౌనమే సమాధానంగా నిలిచింది. మరో సారి మీటింగ్‌లో ‘నాకు ఓ లవర్‌ ఉన్నాడు ’అని చెప్పింది. ఎవరు? అని అడగకుండా ఆల్‌ ది బెస్ట్‌ అని చెప్పి వచ్చేశా. తన మెమొరీస్‌ నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేక సమయాన్ని మద్యం మత్తులో గడిపేస్తూ కాలం వెలిబుచ్చుతున్నాను. కానీ, తనకు ఎప్పటికీ నేను బాధపడే విషయం తెలీదు. ఆమెకు నేను ఉన్నాననే భరోసా కూడా ఇవ్వలేకపోయాను. మళ్లీ ఓటమి చవి చూశాను. తర్వాత లైఫ్‌లో సెటిల్‌ అయినా... అవకాశాలు అంది పుచ్చుకున్నా... తను నాతో లేని లోటును మాత్రం పూడ్చలేకున్నా.
నేనో పెద్ద ఫేయిల్యూర్‌ని
- పవన్‌ రాజ్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు