ఓ రోజు సడెన్‌గా ఫోన్‌ చేసి నేను కావాలంది

7 Dec, 2019 16:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేను మా అత్త కూతుర్ని పెళ్లిచేసుకోవాలని మా మామ, నాన్నల కోరిక. కానీ, ఇప్పుడు వాళ్లు మా మధ్య లేరు. అందుకని నేను మా అత్త కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత వేరే అబ్బాయి తనకు పరిచయమైతే అతడ్ని కూడా లవ్‌ చేసింది. ఆ విషయం నాకు తెలిసి వాళ్లకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. వాళ్ల అమ్మతో నేను మాట్లాడతానని ఆ అమ్మాయికి చెప్పాను. పక్కపక్క ఇళ్లు అయినా కూడా రెండేళ్ల వరకు తనని చూడలేదు. కానీ, సడెన్‌గా ఒకరోజు నేను కావాలని ఫోన్‌ చేసింది. ఇంతలో నాకు మా ఇంట్లో వాళ్లు పెళ్లి చేయటానికి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఆ అమ్మాయి ఇప్పుడు రోజూ కాల్‌ చేస్తోంది. నేను లేకుండా లేనంటోది. అప్పుడు నాకు మా చెల్లి మాటలు గుర్తుకు వచ్చాయి.

‘ అన్నా! నువ్వు ఇష్టపడిన వాళ్లను చేసుకుంటే కొందరు మాత్రమే నీతో ఉంటారు. అందరికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అందరూ నీతో ఉంటారు’ అని. అప్పుడు ఆ అమ్మాయి నాకు వద్దని డిసైడ్‌ అయ్యా. ఆ అమ్మాయి కాల్‌ చేస్తే మా అత్త కోసం ఆమెతో మాట్లాడుతున్నాను. నేను హ్యాపీగా ఉన్నాను. ఆ అమ్మాయికి నా మీద ఆశ పోయేలా చేస్తున్నాను. నా చెల్లి మాటలు నన్ను మార్చాయి. ప్రేమ అంటే అందరూ కలిసి ఉండటం! ఇద్దరు వ్యక్తులు కాదు.
- రాజేష్‌
చదవండి : ఫ్రెండ్‌గా ఉండలేను.. ఎన్ని రోజులైనా ఇలానే..

ఫ్రెండ్‌గా ఉండలేను.. ఎన్ని రోజులైనా ఇలానే..


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు