నేను ప్రేమిస్తున్న అమ్మాయే తన ప్రేమని..

23 Oct, 2019 10:20 IST|Sakshi

తన పేరు జ్ఞాపిక నాకు మంచి స్నేహితురాలు! చాలా అందంగా ఉంటుంది. దీంతో ఆమెను చాలా మంది ఇష్టపడి వెంటపడేవారు. కానీ ఆమె ఎవరినీ అంతగా పట్టించుకునేది కాదు. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత మార్చి-2018లో తను మళ్లీ లైబ్రరీ ముందు తారసపడింది. మాట్లాడిన కొద్ది నిమిషాల్లోనే తన 'లవ్-ఫెయిల్యూర్' గురించి నాతో చెబుతూ కంటతడి పెట్టింది. తను నాకు చాలా ఏళ్ల నుండి పరిచయం ఉన్నప్పటికీ నాకు తెలిసి ఆమెను అలా ఏడుస్తూ బాధతో చూడటం అదే మొదటిసారి. ఆ క్షణాన ఆమె కళ్లలో తన ప్రేమ తాలూకు నిజాయితీ చూసి ఆశ్చర్యం, అలాగే తనపై జాలీ కూడా కలిగింది. అదే విధంగా తనపైన, తన ప్రేమపైన పూర్తి గౌరవం పెరిగింది. అలా తను అప్పుడప్పుడు (చాలా తక్కువ సార్లు) కలిసేది. తన ప్రేమ కష్టాలను నాతో మాటల్లోనూ అలాగే మెసేజ్‌లోనూ పంచుకునేది. కొద్దినెలల తర్వాత( అక్టోబర్-2018లో) ఆమెతో నా చనువు తనపట్ల ఇష్టాన్ని కలగచేసింది. అయినా నేను తనతో అలాగే స్నేహంగా మెలిగేవాన్ని.

ఆమెకు తెలుసు తన 'లవ్-ఫెయిల్యూర్' సంపూర్ణమని! కానీ, నెలలు గడుస్తున్నా ఆ భావన నుంచి బయటకు రాలేకపోయింది. అలా రోజులు గడిచేకొద్దీ తనతో నా స్నేహ ప్రయాణము (ఫిబ్రవరి-2019 నాటికి) ప్రేమగా మారింది. ఇక అప్పటినుండి తనతో ఉండాలని, మాట్లాడాలని నా ప్రేమను తనతో చెప్పాలని ఉండేది కానీ, చెప్పలేక పోయాను. నేను ఆమెతో ఉన్న ప్రతిక్షణం ఒక మధురమైన జ్ఞాపకంగా భావిస్తే తను మాత్రం అనుక్షణం తన (మాజీ) ప్రియుడి గురించి తన జ్ఞాపకాల గురించి నాతో చెప్పేది. అలా నేను ప్రేమిస్తున్న అమ్మాయే తన ప్రేమని నాతో ఒక స్నేహితుడిగా పంచుకోవడంతో నాకు ఏమీ తోచేదికాదు. కానీ, ఇలా అయినా ఆమెతో నేను ఉండొచ్చు, మాట్లాడొచ్చు అని తను ఏమి చెప్పినా ఓపికగా వినేవాన్ని. మొన్న (28 సెప్టెంబర్-2019) తనకు ఆరోగ్యం బాగాలేక ఇంటికి వెళ్తుంటే నాలో ఆ ప్రేమ తాలూకు ఎమోషన్స్ ఎక్కువై తను ఎయిర్-పోర్ట్‌కి వెళ్తుంటే తట్టుకోలేక ఫోన్ చేసి మాట్లాడాను.

తనకి విషయం అర్థం అయ్యింది. నేను తనతో పీకల్లోతు ప్రేమలో ఉన్నానని. ఇక అప్పటినుండి నన్ను దూరంగా ఉంచుతోంది. తను ఇంటికి వెళ్లినప్పటినుండి ఫోన్ కాల్ లేదు, నేను మెసేజ్ చేస్తే చిరాకు పడటం మొదలుపెట్టింది. దానికి కారణం ఆమె ఇంట్లో ఉండటం ఐతే సరే, కానీ కావాలని నన్ను దూరంగా పెడితేనే తట్టుకోలేను. ఈ ఎనిమిది సంవత్సరాల క్యాంపస్  జీవితములో నాకు సన్నిహితంగా ఉన్న ఒకే ఒక‍్క అమ్మాయివి నువ్వు. అలాంటి నువ్వే నాకు ఒక పది నిమిషాల సమయం ఇవ్వకపోవటం చాలా బాధగా ఉంది జ్ఞాపిక. ఇప్పటికీ నేను అడిగేది ఒక్కటే నాలో ఉన్న ప్రేమని తెలిపేందుకు నాకు కేవలం పది నిమిషాల సమయం మాత్రమే ఇవ్వు. ఇందులో వ్యక్తపరచిన నా భావాలు కేవలం సంక్షిప్తం మాత్రమే, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. నీ రాకకై వేయికళ్లతో ఎదురుచూస్తున్నా.
 - నీ ప్రియ-స్నేహితుడు శేషు, న్యూఢిల్లీ.( పేర్లు మార్చాం)
లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు