నేను ఆమెను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు

30 Oct, 2019 10:34 IST|Sakshi

ఎలా మొదలుపెట్టాలో అర్థం కావటం లేదు. నేను చదివింది గవర్నమెంట్‌ కో ఎడ్‌ స్కూల్‌, కాలేజీలో. అయినప్పటికి నాకు మా క్లాస్‌ అమ్మాయిలతో అస్సలు పరిచయాలు ఉండేవి కావు. అలా టెన్త్‌, ఇంటర్‌ కంప్లీట్‌ అయ్యాయి. లాంగ్‌టర్మ్‌ కోసం ఓ సంవత్సరం బ్రేక్‌ వచ్చింది. దాని తర్వాత నాకు ప్రొఫెషనల్‌ డిగ్రీలో సీట్‌ వచ్చింది. నాకు బయటి ప్రపంచం గురించి సరిగా తెలీదు! ఫ్యాషన్స్‌, స్టైల్స్‌ లాంటివి పెద్దగా అలవాటు లేదు. చాలా అమాయకంగా ఉండేవాన్ని. కాలేజీలో చేరిన కొత్తలో మా సీనియర్స్‌ ఫ్రెషర్స్‌ పార్టీ ఇచ్చారు. మా జూనియర్స్‌ అందరం కలిసి స్టేజిమీద డాన్స్‌ చేస్తున్నాము. అప్పుడు చూశాను తనని చాలా దగ్గరగా. చూడగానే నచ్చింది! తను మంచి డ్యాన్సర్‌ కూడా. ఆ రోజు తనతో మాట్లాడటానికి కుదరలేదు. ఆ తర్వాత తనకు ఎఫ్‌బీలో రిక్వెస్ట్‌ పెట్టా. ఎందుకంటే తనతో డైరెక్ట్‌గా మాట్లాడాలంటే భయం.

ఎఫ్‌బీ అయితే కొంచెం బెటర్‌ కదా! అలా మా మధ్య స్నేహం కుదిరింది. తనతో చాలా ఎక్కువ టైం స్పెండ్‌ చేసేవాన్ని. ఎక్షామ్స్‌లకు కూడా చదవకుండా చాటింగ్‌లు చేయటం వ్యసనంలా మారింది. తరచు చిన్నచిన్న గొడవలు వచ్చేవి. అయినా మళ్లీ కలిసిపోయేవాళ్లం. నేను చాలా కోపిష్టిని, ఒకసారి ఇద్దరం గొడవపడి 6 నెలల వరకు మాట్లాడుకోలేదు. అప్పుడే ఫైనల్‌ ఇయర్‌ వచ్చేసింది. ట్రైనింగ్‌ కోసం మా క్లాస్‌ మొత్తం 2 గ్రూపులుగా విడిపోయాం. ఇక అప్పటినుంచి ఫైనల్‌ ఇయర్‌ మొత్తం తనను కలవలేదు. కానీ, ఇయర్‌ ఎండింగ్‌లో టూర్‌ ఉండింది. అప్పుడు తనను కలిశాను. ఆమె చాలా సంతోష పడింది. నాకు తనంటే ఎంతో ఇష్టం తనకు కూడా నేనంటే చాలా ఇష్టం.

ఇద్దరిదీ ఒకే మతం కానీ వేరు వేరు రాష్ట్రాలు. ఆమె చాలా రిచ్‌ పర్సన్‌! నేను లోయర్‌ మిడిల్‌ క్లాస్ ఫ్యామిలీ. తను అప్పుడప్పుడు అనేది ‘మా ఇంట్లో వాళ్లకు ఇవన్నీ నచ్చవు’ అని. అందుకే నేనెప్పుడూ ధైర్యం చేయలేదు. మా బీఎస్‌ఈ కూడా అయిపోయింది. సంవత్సరం అవుతోంది తనతో మాట్లాడి. తను అప్పుడప్పుడు చెప్పి బాధపడేది ‘నేను ఇంటికి వెళ్లిపోతే ఇంత క్లోస్‌గా కాంటాక్ట్‌లో ఉండలేము’ అని. ఇప్పుడు నాకు మంచి గవర్నమెంట్‌ జాబ్‌ వచ్చింది. అయినా తనని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ, నేను తనని ఎప్పటికీ మర్చిపోలేను.
- శ్రీనివాస్‌, కర్నూల్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు