తను ఎంతలా ప్రేమించిందంటే నా కోసం..

26 Oct, 2019 11:03 IST|Sakshi

సునీత (అమ్ములు) ప్రేమలో పడే నాటికి నాకు 19 సంవత్సరాలు ఉంటాయేమో. నేను తనలో ఎక్కువ ఇష్టపడేది తన స్పష్టమైన వ్యక్తిత్వం, ధైర్యంగా ఏదైనా చెప్పగలిగిన తత్వం. ప్రేమించింది నేనే అయినా.. మొట్టమొదటిసారి తనే  ‘ఐ లవ్‌ యూ’ అని చెప్పింది! నేను ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసి. తనకి నేనంటే ప్రాణం! ఎంతలా ప్రేమించిందంటే నా కోసం అందరినీ వదులుకునేంతలా.. కులాంతరాలను దాటి మా ప్రేమ పెళ్లి వరకు వచ్చే సరికి 30 వయసుకు వచ్చాం. దాదాపు 11 సంవత్సరాల మా నిరీక్షణ ఫలించి పెళ్లి చేసుకున్నాం. ఆగస్టు 23, 2018న మా పెళ్లి జరిగింది. ఆగస్టు 22, 2019న ఇద్దరం ఆశించినట్లుగానే మాకు పాప పుట్టింది.

భార్గవ్‌, సునీత

అనారోగ్యం కారణంగా తను చనిపోయింది. తనే ప్రాణంగా బ్రతికిన నాకు మళ్లీ మరో ప్రాణాన్ని నా చేతిలో ఉంచి వెళ్లిపోయింది. పాపలో తన రూపాన్ని 11 సంవత్సరాల మా స్నేహం, ప్రేమ తాలూకు జ్ఞాపకాలని చూస్తూ.. తనని చేరే రోజు కోసం ఎదురుచూస్తున్నా. ప్రేమికులు ఫెయిల్ అవ్వొచ్చు ప్రేమ మాత్రం ఎన్నటికి ఫెయిల్ కాదు. ప్రేమ శాశ్వతం.. ప్రేమే జీవితం.
- సునీత భార్గవ్‌ 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

disclaimer
‘‘ వరల్డ్‌ ఆఫ్‌ లవ్‌’’ లో ప్రచురితమయ్యే ప్రేమ కథలన్నింటికి పాఠకులే రచయితలు. అందువల్ల ఈ కథనాల్లోని వాస్తవాలు, అవాస్తవాలతో సాక్షి.కామ్‌కు ఎటువంటి సంబంధం లేదు. ప్రేమ కథల విషయంలో ఎవరికైనా ఇబ్బంది ఉన్నా అభ్యంతరాలు ఉన్నా worldoflove@sakshi.comకు తెలియజేయగలరు. అంతకుమించి ఇతర విషయాలకు సాక్షి బాధ్యత వహించదు.

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు