ఆ మాట చెప్పకపోవడం నాదే తప్పు!

14 Jan, 2020 12:50 IST|Sakshi

 ప్రేమ అన్న పదం ఇద్దరి మనసులో చేసే ఆ చిలిపి చేష్టలు.. నా జీవితంలోనూ ఆ రెండు అక్షరాల ప్రేమ ఎన్నో మలుపులతో ప్రయానిస్తోంది. నా వయసుకి తెలియదు ప్రేమంటే ఏంటో అప్పుడే ఆ అమ్మాయి నా కళ్లముందుకు వచ్చి వాలింది... తనని చూడగానే ఏదో తెలియని ఓ ఆనందం తననే చూస్తూ ఉండాలనే స్వార్ధం అది కొన్నాళ్లకి మరింత ఇష్టంగా మారింది. తనని చూసే  ప్రతిక్షణం, కలిసిన అనుక్షణం ఏదో తెలియని సంతోషంతో ఉప్పొంగిపోయేవాడ్ని.  తను పిలిచిన ప్రతిసారి, తనతో మాట్లాడిన అనుక్షణం, తను చేసే ప్రతి పని చూసి మురిసిపోయేవాడ్ని.  అలా నాలో నేను ఇష్టాన్ని పెంచుకుంటూ వచ్చా.  తన అందం మందారం. తన  స్వభావమే అందులో మకరందం.  అందుకే నన్ను తనవైపు మళ్లించి మరింత ఆశను నాలో  కలిగించింది.  ఇలా కొంతకాలం తరువాత అది ఇష్టం నుంచి ప్రేమగా మారింది.  ప్రేమకు అర్ధం తెలుసుకున్న నేను తనే నా అర్ధాంగి అనుకున్నా. తనుకు నా పైన ఇష్టం ఉంది అని అనుకుంటూ గడిపా.  కొన్నాళ్లకి నా ప్రేమను చెప్పాలి అనుకున్నా కానీ ఆ ప్రేమను తనతో చెప్పలేక  నా గుండెలోనే దాచేశా. 

 కాని అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. అప్పుడే నాలో  ఏదో తెలియని అలజడి మొదలై  గుండె గుభేలుమంది.   తనికి ఇంట్లో పెళ్లిసంబంధాలు  చూస్తున్నారు అని తెలిసింది. అది విన్న ఒక్క క్షణము నా గుండె ఆగినంత పని అయ్యింది. అయిన ప్రాణంగా ప్రేమిచిన అమ్మాయికి నా ప్రేమను చెప్పకపోవడం నా తప్పే. ఇన్ని రోజుల మా ప్రయాణంలో తనికి నాపై ఇష్టం తప్పా ప్రేమ కలగలేదు.  అది తెలిసి బలవంతం చేసి బంధాలను దూరం చేసుకోలేక  నా ప్రేమను చంపుకున్నాను. అయిన తనని ప్రేమించడం  మానలేదు తనిని మరిచిపోలేదు.

ఉదయ్‌( చిత్తూరు). 

మరిన్ని వార్తలు