నేనెంత పిచ్చిపని చేశానో అర్థమవుతోంది

15 Feb, 2020 14:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మానాన్నల బలవంతంమీద ఓ మాట్రిమొనియల్‌ సైట్‌లో నా వివరాలు నమోదుచేశా. ఆ మాట్రిమొనియల్‌ సైట్‌లోనే వరుణ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. పరిచయం పెరిగే కొద్ది అతడిపై ప్రేమ పుడుతుందని భావించా. అయితే ఆ సమయంలో మానసికంగా నా ఆరోగ్యం అంతగా బాగోలేదు. నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో కూడా ఈ విషయాలు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడిని సరిగా పట్టించుకునేదాన్ని కాదు. అతడు మాత్రం నాకు తరచు ఫోన్‌ చేస్తుండేవాడు. ప్రేమగా మాట్లాడుతుండేవాడు. నాకు ఇష్టం లేకపోయినా ఇబ్బంది పడుతూనే మాట్లాడేదాన్ని.

అతడి వైపునుంచి నాపై ఆశలు పెరుగుతూపోయాయి. నాకు మాత్రం అతడిమీద ఇష్టం కలగలేదు. దీంతో నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి, వరుణ్‌తో మాట్లాడటం మానేశాను. అయితే పూర్తిగా సంబంధాలు తెంచుకున్న రెండు సంవత్సరాల తర్వాత అతడిపై ఇష్టం​ మొదలైంది. ఇప్పుడు ఆలోచిస్తుంటే నేనెంత పిచ్చిపని చేశానో అర్థమవుతోంది. తప్పు చేశానన్న భావనలోంచి బయటపడలేకుండా ఉన్నా.

ఎలాగైనా అతడ్ని కలిసి క్షమాపణ చెప్పాలనిపిస్తోంది. దానికి తోడు మా వాళ్లు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని చూస్తున్నారు. నాకు మాత్రం వరుణ్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది. అర్థం కాని విషయం ఏంటంటే అతడింకా పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నాడా? ఇప్పుడు నేను ఫోన్‌ చేస్తే ఎలా స్పందిస్తాడు? ఇలాంటి ప్రశ్నలే నా మెదడును తినేస్తున్నాయి. ఎలాగైనా అతడితో మాట్లాడాలని ఉంది. 
- శైలజా, చిత్తూరు

చదవండి : ఆ రోజునే పెళ్లి చేసుకుంటాం!లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు