తన ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నా..

27 Nov, 2019 15:17 IST|Sakshi

నా  పేరు సందీప్‌. కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా ప్రియా నాకు పరిచయమైంది. బీటెక్ చదివే రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి బెంగుళూరు వెళ్లాను. అక్కడే ప్రియా నాకు పరిచయమైంది. అలా ఓ రోజు...హాయ్‌, నేను ప్రియా ఎలా ఉన్నారు అని వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. నేనూ హలో అండి ఎలా ఉన్నారు అని అడిగా. ఒక అక్కడ్నుంచి మొదలైంది మా ప్రేమ ప్రయాణం. మొదట అండి,గారు నుంచి ఏకవచనంతో సంబోధించేంత క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. తను నాతో వాళ్ల కాలేజీ, ఫ్రెండ్స్‌..ఇలా అన్ని విషయాలు పంచుకునేది. నేను కూడా తనతో అన్నీ చెప్నేవాడ్ని. రోజులు గడిచాయి. మా మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ కాస్తా లవ్‌ ట్రాక్‌కి మారింది. ఇక అప్పటినుంచి నేను వీలు చూసుకొని బెంగుళూరు వెళ్లి తనను కలిసేవాడ్ని. కాలేజీకి ఒక్కరోజు కూడా బంక్‌ కొట్టని నేను..తన కోసం కాలేజీకి సెలవుపెట్టి బెంగుళూరులో వాలిపోయేవాడ్ని. అలా ఓ రోజు తిరుపతి వెళ్లాం. దైవ దర్శనం చేసుకొని తిరిగి బెంగుళూరు వెళ్లాం. తనతో కలిసి ప్రయాణించిన మొదటి ట్రిప్‌ అది. కొంచెం సెంటిమెంట్‌గా ఉంటుందని  తిరుపతికి వెళ్లాం. 

నా స్టడీస్‌ అవ్వగానే జాబ్‌ వచ్చింది. లొకేషన్‌ బెంగుళూరు పెట్టా. అప్పట్నుంచి బెంగుళూరు నగరం నాకు మరింత అందంగా కనిపించేది. తనతో కలిసి సినిమాలు,షికార్లు, బోట్‌ రైడింగ్‌లు...ఇలా చాలా చేశాం. తనకి వాళ్ల ఊర్లోనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. అప్పట్నుంచి మేం కలుసుకోవడానికి కుదిరేది కాదు. ప్రియా వాళ్ల నాన్న చాలా స్ర్టిక్ట్‌. ప్రేమ వివాహానికి పూర్తిగా వ్యతిరేకి. అలాంటిది మా ప్రేమ వ్యవహారం తెలిస్తే ఎలా రియాక్ట్‌ అవుతాడో అని ప్రియా చాలాసార్లు బాధపడేది. ఓరోజు నేను కాల్‌ చేస్తే...ప్రియా వాళ్ల అమ్మ ఫోన్‌ ఎత్తారు. నా పేరు చిన్నూ అని సేవ్‌ చేసుకోవడంతో వాళ్ల ఇంట్లో మా విషయం తెలిసింది. వాళ్ల నాన్న అయితే ప్రియాను బయటికి వెళ్లనివ్వకుండా నిర్భందించారని ఓ రోజు నాకు కాల్‌ చేసి ఏడ్చింది. మా పేరేంట్స్‌ని ఒప్పించు లేదా ఇద్దరం చచ్చిపోదాం అంటుంది. ఈ విషయం మా వాళ్లకి చెప్పా. మొదట్లో మా పేరెంట్స్‌ కూడా ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత నా బాధ చూడలేక ఒప్పుకున్నారు. ఆ రోజునుంచి తన ఫోన్‌ కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. తన దగ్గర్నుంచి ఎలాంటి రెన్పాన్స్‌ లేదు. ప్రియాతో మాట్లాడక ఇప్పటికీ నెలరోజులవుతుంది. తను ఎప్పుడు ఫోన్‌ చేస్తుందా అని వెయిట్‌ చేస్తున్నా. 

మరిన్ని వార్తలు