ప్రేమికుల కోసం కోడ్‌ లాంగ్వేజ్‌

11 Dec, 2019 12:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమలో పడగానే మన భావాలు, ఆలోచనలు, ప్రాముఖ్యతలు అన్నీ మారిపోతాయి. అప్పటివరకు మాట్లాడితే ముత్యాలు రాలుతాయి అన్నంతలా ఉండేవారు కూడా గంటలు, గంటలు ఫోన్లలో మాడ్లాడేస్తుంటారు. స్వేచ్ఛగా మాట్లాడుకునే వీలు లేదనుకునే వాళ్లు చాటింగ్‌ చేస్తూ గడిపేస్తుంటారు. ప్రేమగా పిలుచుకునే ముద్దుపేర్లు కావచ్చు, వాళ్లని ఇంప్రెస్‌ చేయటానికి చేసే ప్రయత్నమే కావచ్చు.. కోపం, బాధ, ప్రేమ, ఇలా అన్నీ ఓ నదిలా మెసేజ్‌ల ప్రవాహం కొనసాగుతుంటుంది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఎప్పటికప్పుడు ఆ మెసేజ్‌లను డిలేట్‌ చేయటం కుదరని పని. అదృష్టం అడ్డం తిరిగినపుడు అరటిపండు తిన్నా పండు ఊడుద్ది అన్నట్లు ఏదో ఒక సందర్బంలో పట్టుపడక తప్పదు. 

ఆ సమయంలో మన పరిస్థితి వర్ణనాతీతం. అలా కాకుండా ఆ మెసేజ్‌లు మిత్రుల కంటపడ్డా.. పొరపాటున వేరే వ్యక్తులకు పోయినా వాళ్ల హేళనతో మనసు కచ్చితంగా నొచ్చుకుంటుంది. ఇలాంటి సమయంలోనే బాహుబలిలో కిలికిలి భాషలాగ ప్రేమికులకు కూడా ఓ భాష అవసరం తప్పక ఉంటుంది. అయితే ఇది మాట్లాడ్డానికి కాదు మెసేజ్‌లు చేసుకోవటానికి. కోడ్‌ లాంగ్వేజ్‌లో మెసేజ్‌లు చేసుకున్నట్లయితే ఏ ఇబ్బంది ఉండదు.  ప్రేమికులు తమ భావాలను నిర్భయంగా పంచుకోవచ్చు. మెసేజ్‌లు డిలేట్‌ చేయాల్సిన పనిలేదు. పక్కవారు ఆ మెసేజ్‌లను చూసినా ఆ భాష ఏంటో అర్థం కాక జుట్టుపీక్కుంటారు.  

కోడ్‌ లాంగ్వేజ్‌లు : 
1) రివర్స్‌ మెథడ్‌ 
ఇది చాలా సులభమైన కోడ్‌ లాంగ్వేజ్‌. ఇది తొందరగా అర్థం చేసుకునే వీలుంటుంది. ఈ మెథడ్‌లో పదాలను రివర్స్‌ చేసి రాయండి. ఇది బాషతో సంబంధం లేకుండా అన్నిటికి సరిగ్గా సరిపోతుంది. 
ఉదా : ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ రివర్స్‌ చేసి రాస్తే.. ‘నునే న్నుని నున్నాస్తుమిప్రే’  ఇలా రాసుకోవాలి. ఇక ఇంగ్లీష్‌ విషయానికొస్తే ‘‘  i love  you’’ ను ‘‘ i evol uoy’’ అవుతుంది.

2) రిప్లెక్ట్‌ మెథడ్‌ 
ఈ మెథడ్‌లో ఒక అక్షరాన్ని మరో అక్షరంగా అనుకోవాలి. ఈ కోడ్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లీషుకు మాత్రమే వర్తిస్తుంది. ఏ నుంచి ఎమ్‌ వరకు ఆల్ఫాబెట్లను వరుసగా రాసుకోవాలి. దాని క్రిందుగా మిగిలిన ఆల్ఫాబెట్లను రాయాలి. అప్పుడు ఏ క్రిందుగా ఎన్‌.. ఎమ్‌ క్రిందుగా జెడ్‌ వస్తుంది. అంటే ఏను మనం ఎన్‌ అనుకోవాలి, ఎన్‌ను ఏ అనుకోవాలి. అదే విధంగా ఎమ్‌ను జెడ్‌ అనుకోవాలి జెడ్‌ను ఎమ్‌ అనుకోవాలి. 
ఉదా : ‘‘i love you’’  ను కోడ్‌ లాంగ్వేజ్‌లో రాస్తే   ‘‘v ybir lba ’’ అవుతుంది. మరో ఉదాహరణగా.. 

ఇక అదేవిధంగా ఆల్ఫాబెట్లను నెంబర్లుగా అనుకోవటం అందరికీ తెలిసిన మెథడే. మూస పద్దతిలో మనం వీటినే ఫాలో అవ్వాలనే రూలేమీ లేదు. కొంత అవగాహన ఉంటే కొత్తగా మనమే ఓ కోడ్‌ లాంగ్వేజ్‌ను సృష్టించవచ్చు. మీకు, మీ ప్రేయసి/ ప్రియుడికి మాత్రమే అర్థమయ్యేలా ఓ భాషను రూపొందించి నిర్భయంగా చాటింగ్‌ చేసుకోవచ్చు. అయితే వీటిని అర్థం చేసుకోవటం, అలవాటైన భాషంత వేగంగా వీటిని చదవటం అంత తేలిక కాదు. బాగా ప్రాక్టీస్‌ చేస్తూ ఉంటే తొందరగానే అలవాటవుతుంది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు