130 కేజీల అందమైన అమ్మాయితో ప్రేమ

4 Nov, 2019 11:45 IST|Sakshi
‘‘షాలో హాల్‌’’ చిత్రంలోని దృశ్యం

లవ్‌ సినిమా

సినిమా : షాలో హాల్‌
తారాగణం : జాక్‌ బ్లాక్‌, గ్వెనెత్‌ పాల్‌త్రో, జాసన్‌ అలెగ్జాండర్‌ తదితరులు
డైరక్టర్స్‌ : పీటర్‌ ఫార్రెలే, బాబీ ఫార్రెలే

కథ : హాల్ లార్సన్‌ ‌( జాక్‌ బ్లాక్‌ ) తండ్రి ఆఖరి కోరిక మేరకు అందమైన యువతులతో మాత్రమే డేటింగ్‌ చేయటానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే హాల్‌ ఇష్టపడ్డ అమ్మాయిలు అతడ్ని దూరంగా ఉంచుతుంటారు. దీంతో హాల్‌ నిరాశకు గురవుతాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు లిఫ్టులో పరిచయమైన సెల్ఫ్‌ హెల్ప్‌ గురు టోనీ రాబిన్స్‌‌( టోనీ రాబిన్స్‌)తో తన బాధను చెప్పుకుంటాడు. హాల్‌ అంగీకారం మేరకు టోనీ రాబిన్స్‌ అతడ్ని హిప్నటైజ్‌ చేసి ఎదుటి వ్యక్తి అందాన్ని కాకుండా మంచి మనసును మాత్రమే చూడగలిగేలా చేస్తాడు. ఆ తర్వాతినుంచి హాల్‌కు మంచి మనసు ఉన్న వాళ్లు చాలా అందంగా కన్పిస్తుంటారు. అప్పుడే అతడికి రోజ్‌మేరీ( గ్వెనెత్‌ పాల్‌త్రో) పరిచయమవుతుంది.

‘‘షాలో హాల్‌’’ చిత్రంలోని దృశ్యాలు
ఆనతి కాలంలో ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మామూలుగా రోజ్‌మేరీ 130 కేజీల భారీకాయురాలు అయితే హిప్నటైజ్‌ ప్రభావం కారణంగా రోజ్‌మేరీ మంచి మనసు హాల్‌కు అత్యంత అందంగా కనిపిస్తుంటుంది. పీకల్లోతు ప్రేమలో ఉన్న హాల్‌, రోజ్‌మేరీ ఎక్కడికి వెళ్లినా వారి జంటను చూసి అందరూ నవ్వుకుంటుంటారు. హాల్‌ స్నేహితుడు మారీషియో(జాసన్‌ అలెగ్జాండర్‌) భారీకాయురాలైన అమ్మాయిని అతడు ప్రేమించటం తట్టుకోలేకపోతాడు. అతడ్ని హిప్నటైజింగ్‌ నుంచి బయటకు తీసురావాలని ప్రయత్నిస్తాడు. మారీషియో, హాల్‌ను  హిప్నటైజింగ్‌ నుంచి బయటకు తీసుకువస్తాడా? హాల్‌ ఒకవేళ హిప్నటైజింగ్‌ నుంచి బయటకు వస్తే భారీకాయురాలైన రోజ్‌మేరీని ప్రేయసిగా అంగీకరిస్తాడా? లేదా? అన్నదే మిగితా కథ. 

విళ్లేషణ : 2001లో విడుదలైన ‘‘షాలో హాల్‌’’  ఓ మంచి ఫీల్‌గుడ్‌ లవ్‌ సినిమా. ప్రతి మనిషి ఎదుటి వ్యక్తి మంచి మనసును అందం రూపంలో చూడగలిగితే మంచి మనసున్న కురూపులు కూడా అత్యంత అందంగా కన్పిస్తారన్న పీటర్‌ ఫార్రెలే, బాబీ ఫార్రెలేల ఆలోచన అద్బుతం. అందం శరీరానికి కాదు మనసుకు సంబంధించిందన్న విషయాన్ని సినిమాతో చక్కగా చూపించారు. ఈ సృష్టిలో లోపాలులేని మనిషి అంటూ ఎవరూ లేరని కళ్లకు మనసుకు మధ్య ఉన్న చీకటి పొర తొలిగినపుడు ఆ లోపాలు నిజమైన ప్రేమకు అడ్డంకులు కావని అర్థమవుతుంది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు