చాలా సార్లు అనిపించింది! ధైర్యం చాల్లేదు..

16 Feb, 2020 10:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజుల్లో అభిని చూశాను. తను మా సీనియర్‌! చాలా అందంగా ఉండేవాడు. చూడగానే నచ్చేశాడు. ప్రతిరోజూ కాలేజీలో అతడ్ని చూసేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్దీ అతడిమీద చాలా ఆశలు పెంచుకున్నాను. నా ప్రేమ సంగతి అతని చెబుదామని లెక్కలేనన్ని సార్లు అనిపించింది! ధైర్యం చాలక  ఆగిపోయాను. తను కనిపించని రోజు చాలా బాధగా ఉండేది. వేసవి సెలవుల్లో అయితే ఇంకా కష్టంగా. అందరు సెలవుల కోసం ఎదురుచూస్తే.. నేను సెలవులు ఎప్పుడు అయిపోతాయా! అభిని ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూసేదాన్ని. నేను సెకండ్‌ ఇయర్‌, తను థర్డ్‌ ఇయర్‌. తనతో ఒక్కసారైనా మాట్లాడే అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తున్నాను.

ఓ రోజు తనే నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. మాట్లాడింది రెండు మాటలే అయినా చాలా సంతోషంగా అనిపించింది. చూస్తుండగానే అతడి ఫైనల్‌ ఇయర్‌ ఎండింగ్‌కు వచ్చింది. ఫేరెవల్‌ పార్టీలో చివరిసారిగా అతడ్ని చూశాను. తర్వాత చూడలేదు. ఐదేళ్లు గడిచిపోయింది. అయినా అతడ్ని మర్చిపోలేకపోతున్నా. ప్రతిరోజూ అతడు గుర్తుకువస్తూనే ఉంటాడు. తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. వచ్చే జన్మకైనా నా ప్రేమ ఫలిస్తుందని ఆశిస్తూ..
- సణ్ముఖి, గోపల్లె

చదవండి : అయ్యో! వాలెంటైన్స్‌ రోజు.. ఫీల్‌ పోయింది..

నేనెంత పిచ్చిపని చేశానో అర్థమవుతోందిలేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు