ఈస్టర్‌పై సిస్టర్‌ విమలారెడ్డి సందేశం

11 Apr, 2020 21:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు శిలువ మరణం పొంది మూడవ రోజున సజీవుడై తిరిగి లేచిన పర్వదినమే ఈస్టర్. లోకంలో కక్ష, రాక్షసత్వాలు ఎంతగా పేట్రేగినా.. ప్రేమ, కరుణలకు సమాధి కట్టలేరు. ఈ పరమ సత్యాన్ని చాటేదే ఈ పర్వదినం.. శిలువపై బలిదానమైన దైవ కుమారుడు ఏసుక్రీస్తు పునరుత్థానం చెందిన పర్వదినమే ఈస్టర్‌.. శోకానికి అడ్డుకట్ట తథ్యమని..అంతిమంగా క్షమే జయిస్తుందని, పొలిమేరలు లేని ప్రేమకే పట్టాభిషేకమని సందేశమిచ్చే పండగ ఈస్టర్‌. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈస్టర్‌ ఆదివారం రోజున క్రైస్తవులు సమాధుల వద్దకు చేరుకుని రంగులతో అలకరించిన సమాధులపై పూలు చల్లి, కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తారు. ఈస్టర్‌ పర్వదినం ప్రాముఖ్యతపై సిస్టర్‌ వైఎస్‌ విమలారెడ్డి వివరణాత్మక సందేశం ఇచ్చారు. ఈస్టర్‌ పర్వదినంపై పూర్తి వివరణాత్మక సందేశం కోసం ఈ కింది వీడియోను వీక్షించండి.

మరిన్ని వార్తలు