మా మధ్య ప్రేమ, గొడవలు పీక్స్‌కు వెళ్లిపోయాయి

15 Nov, 2019 15:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

2017 మార్చిలో నాకు జాబ్‌ వచ్చింది. అమ్మకి నాన్నకు సహాయంగా ఉంటుందని మ్యారేజ్‌ చేసుకుందామనుకున్నాను. చాలా సంబంధాలు వచ్చాయి. నేను ఎవరినీ చూడటానికి వెళ్లలేదు. అమ్మాయిల ఫొటోలు కూడా చూడలేదు. ఎందుకంటే నాకు మొదట్లో ఒక మెయిల్‌ వచ్చింది! మ్యారేజ్‌ బ్రోకర్‌నుంచి. అందులో నాలుగు ఫొటోలు ఉన్నాయి. ఫస్ట్‌ ఓ ఫొటో ఓపెన్‌ చేసి చూశాను. తర్వాత ఫొటోలు చూడాలనిపించలేదు. తనే నా లైఫ్‌ పార్ట్‌నర్‌ అని ఫిక్స్‌ అయ్యా. ఇంట్లో కూడా చెప్పా తననే చేసుకుంటా ఇక ఏ సంబంధాలు చూడొద్దని. ఇంట్లో వాళ్లు కూడా సరే అని వాళ్లతో మాట్లాడారు. వాళ్లు నన్ను రిజెక్ట్‌ చేశారు. నేను నైట్‌ షిఫ్టులు చేస్తున్నానని. ఆమె ఫొటో చూడగానే నాకు బాగా నచ్చింది. అందుకే ఆ అమ్మాయి వాళ్లు రిజెక్ట్‌ చేసినా నాకు ఆమెపై మరింత ప్రేమ కలిగింది. తననే పెళ్లి చేసుకుంటా లేకపోతే లేదు అని నిర్ణయించుకున్నా.

నాకు ఎక్కడో నమ్మకం తను మళ్లీ వస్తుందని. అది జరిగిన ఓ నెలకు మళ్లీ వాళ్లు మా ఫ్యామిలీని సంప్రదించారు. వాళ్ల మామయ్య నన్ను మా ఆఫీస్‌ దగ్గర కలిశాడు. నేను ఆ అమ్మాయికి కూడా నచ్చాను. ఆమెను లైవ్‌లో చూడటం ఎప్పుడా అని రెండు వారాలు ఎదురు చూశా. ఆ రోజు తనను చూడటానికి వెళ్లాను. వాళ్ల ఇంట్లో కూర్చుని ఉన్నా. తను నా ముందుకు రావటానికి ఇంకో ఐదు నిమిషాలు ఆగాలి అన్నారు. నాకు ఎవరి మాటలు వినపడలేదు. తను ఎప్పుడు వస్తుందా అనుకుంటూ ఎదురుచూస్తూ ఉన్నాను. కొద్దిసేపటి తర్వాత నా ఏంజల్‌ వచ్చేసింది. తనే నా వైఫ్‌ అని, నా బెట్టర్‌ హాఫ్‌ అని ఫిక్స్‌ అయ్యా. అప్పుడే తనకు ప్రపోజ్‌ చేద్దామనుకున్నా. కానీ, నేనంటే ఏంటో తెలియని అమ్మాయికి సడెన్‌గా ప్రపోజ్‌ చేయటం కరెక్ట్‌ కాదని అనిపించింది. ఫస్ట్‌ నేనే చెబుదాం అనుకునే లోపు తనే షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. మీరు బాగున్నారు అంది.

అప్పుడు ఏమి మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అక్కడే డ్యాన్స్‌ చేద్దాం అనుకున్నా. రూములో ఉన్నంత సేపు తనను సరిగ్గా చూడలేదు. నేను బాగున్నానని తను చెప్పేసరికి నా ముఖాన్ని నేను సెల్‌ఫోన్‌ ఓ సారి చూసుకున్నా. నిజంగా అంత బాగున్నానా అని. అక్కడినుంచి అస్సలు వెళ్లాలనిపించలేదు.  నా వైపునుంచి 1000 శాతం ఒప్పుకున్నా. ఎలాగైనా మ్యారెజ్‌ జరగాలని మా ఫ్యామిలీతో చెప్పా. వాళ్లు మా ఇంటికి వచ్చారు. పెళ్లి ఖాయం చేయటానికి. పెళ్లి ఫిక్స్‌ అయ్యాక మాట్లాడదామని ఫోన్‌ నెంబర్‌ అడిగితే ‘ నిశ్చితార్థం అయ్యాక’ అంది వాళ్ల అత్తయ్య. నిశ్చితార్థం రోజు వరకు వేయిట్‌ చేసి ఆ రోజు నేను మొదటిసారి ఆమెకు చెప్పిన మాట ‘ఐ లవ్‌ యూ’. ఆ తర్వాత మా లవ్‌ స్టోరీ స్టార్ట్‌ అయ్యింది. నా పుట్టిన రోజునాడే మా పెళ్లి జరిగింది. అప్పుడప్పుడు మా మధ్య గొడవలు జరిగేవి, పట్టించుకునే వాళ్లం కాదు.

కొద్దిరోజులకే మా మధ్య ప్రేమ, గొడవలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఒక రోజు చిన్న గొడవ పెద్దది అయ్యింది. నన్ను వదిలేసి వెళ్లిపోయింది. అలా ఓ సంవత్సరం గడిచింది. నేను మాత్రం తన ఆలోచనలతోనే బ్రతుకుతున్నా. భౌతికంగా నా దగ్గర లేకపోవచ్చు కానీ, నా హృదయంలో ఉంది తను. అది తనకు ఎప్పుడు అర్థం అవుతుందో ఏమో. మేము ఇంతలా విడిపోవటానికి కారణం మా ప్రేమ. నేను ఏమీ అనక ముందే నేను కట్టిన తాళి తెంపేసిందని నేను.. సూసైడ్‌ అటెంప్ట్‌ చేస్తే నేను వెళ్లలేదని తను. తన గురించే ఆలోచించి ఎప్పటికైనా తనే తిరిగొస్తుందని ఎదురు చూస్తున్నా. కనీసం కోర్టులోనైనా కలవొచ్చననుకుంటే అక్కడికి కూడా రావటం లేదు. తను కచ్చితంగా వస్తుందని నా నమ్మకం.. ఎందుకంటే? నేను తనని ప్రేమిస్తున్నాను గనుక.
- స్పందన్‌ బాబు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు