ఆమె మాటలే మెడిసిన్‌లా పని చేస్తాయి

19 Oct, 2019 15:19 IST|Sakshi

నేను పది పాసై ఇంటర్‌ కాలేజీలో జాయిన్ అవుతున్న రోజులు. కాలేజీలో జాయిన్ అవ్వటానికి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అప్లికేషన్ పట్టుకొని లైన్లో నుంచున్నా. జెంట్స్ అంతా ఒక లైన్లో ఉంటే లేడీస్ అంతా మరో లైన్‌లో ఉన్నారు. ఎక్కడినుండి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు! నా పక్కన ఉన్న లేడీస్ లైన్‌లోకి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఆమెను చూడగానే నన్ను నేను మర్చిపోయాను. ఆఖరికి అప్లికేషన్ ఇవ్వడం కూడా మర్చిపోయా. అంతలోనే ఆమె అప్లికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇంటికెళ్లేవరకు ఆమె నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఆ నైట్ నిద్ర పట్టలేదు. ఆమె రూపమే నా కళ్లముందు కదలాడసాగింది. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ముఖం, నవ్వితే నన్ను నేను మర్చిపోయేంత అందమైన చిరునవ్వు.

మొత్తానికి కాలేజీలో సీట్ వచ్చింది! సీఈసీ గ్రూప్‌లో. ఆమెకోసం మొదటి రోజు కాలేజీ మొత్తం వెతికా ఎక్కడా కనపడలేదు. అన్ని గ్రూప్స్‌లోనూ వెతికినా ప్రయోజనం లేకపోయింది. వారం రోజులు వెతికిన తర్వాత నేను ఆమెను మర్చిపోయా. ‘మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే దాన్ని దేవుడు మనకిస్తాడు’ అన్నట్టు వారం గడిచిన తరవాత ఆమెను నా గ్రూప్‌లోనే జాయిన్ చేశాడు. అప్పటినుంచి నేను దేవుడిని నమ్మడం ప్రారంభించా. నిత్యం ఆమెని చూసే అదృష్టం నాకు ఇచ్చినందుకు రోజూ దేవుడికి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పేవాడినో. అలా ఆమెని చూడగానే ప్రేమలో పడ్డా కానీ, ప్రేమను తెలియచేసే దైర్యం నాకు రాలేదు. ఆమె నాతో ఉంటే సంతోసించేవాడిని.. ఏడిపించేవాడిని, నవ్వించేవాడిని కానీ, నా ప్రేమ విషయం చెప్పలేకపోయా. ఆమె కూడా నన్ను ప్రేమిస్తుందని నా మనసుకు అనిపించేది.

కానీ, ఆ వయస్సు ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియని వయస్సు అని నా మనసుకు అనిపించేది. ఆమె నాతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటానని మాత్రం అనిపిస్తుంది. ఆ ఆలోచనలతోనే ఇంటర్ పూర్తి అయింది. కానీ నా ప్రేమని తెలియచేయలేకపోయా. పదేళ్లు గడిచింది. నా జాబ్‌తో నేను బిజీగా ఉన్నాను. ప్రస్తుతం పెళ్లై ఒక పాప కూడా ఉంది. కానీ ఆమెకి ‘‘ఐ లవ్ యూ కారుణ్య’’ అని చెప్పలేకపోయానన్న బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. 11 ఏళ్లు గడిచాయి. ఒక రోజు నా ఫేస్‌బుక్‌ అకౌంట్‌కి హాయ్ అని మెసెజ్‌ వచ్చింది. చూడగానే ఎగిరి గంతేసేంత సంతోషం. కళ్లలో నీళ్లు తిరిగాయ్. నా ఏజ్ మర్చిపోయా.. నా స్టేటస్ మర్చిపోయా , ఆ ఒక్క మెసెజ్ చూడగానే నేను చెప్పాలనుకున్నది చెప్పేశా ‘‘ఐ లవ్ యూ కారుణ్య’’  అని. ‘‘ఇన్ని ఇయర్స్‌ నన్ను వదిలేసి ఎలా ఉన్నావ్ ’’ అని ముహమాటం లేకుండా అడిగేశా.

కాల్ చేయమని నెంబర్ ఇచ్చింది. వెంటనే కాల్ చేశా. మాటలు రావట్లేదు. కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయ్! మాట కూడా బరువుగా ఉంది. బట్ హార్ట్ మాత్రం వెయిట్‌ తగ్గింది! ఆ ఒక్క మాటతో. ఆమె లవ్ చేస్తున్నదా లేదా అని ఎపుడూ ఆలోచించలేదు. కానీ, నేను చెప్పాలనుకున్నది చెప్పేశా. కానీ చెప్పే ఏజ్‌లో చెప్పలేకపోయినందుకు ఆమె నా లైఫ్‌లో నాతో లేదు. ఆమెని నేను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా. ఐ లవ్ యు ఫర్ ఎవర్. ఆమె కూడా ప్రేమని అర్ధం చేసుకుంది. ఆమె కూడా నన్ను ప్రేమిస్తోంది. తన ప్రేమని నాకు వివరించింది. ప్రేమకి వయసు ఉండదు. దూరంగా ఉన్నా ఎప్పటికీ దగ్గరగానే ఉంటాం. లైఫ్ లాంగ్ ఆమె కూడా నన్ను మిస్ అవుతుంది. నాకు ఫీవర్ వచ్చినపుడు ఆమెతో మాట్లాడితే.. ఆమె మాటలే నాకు మెడిసిన్‌లా పనిచేస్తాయి. రియల్లీ షీ ఈజ్‌ మై సోల్‌...
- సునీల్‌ బాబు, హైదరాబాద్‌ ( పేర్లు మార్చాం)

లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

29 ఏళ్లకే నూరేళ్లు నిండిన ప్రేమ

ఆ రోజు ధైర్యం చేసుంటే ఇలా అయ్యిండేది కాదు!

లెక్చరర్‌ నాకు ప్రపోజ్‌ చేశాడు!

ప్రేమలో ఫెయిల్‌ అయ్యారా? ఇలా చేయండి!

నేను ఆమెను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు

ప్రేయసికి స్నేహితుడితో పెళ్లని తెలిసినా..

మోసం చేశాడు.. అంత అర్హత లేదు

భర్త ప్రాణాల కోసం సింహంతో పోరాడి..

ఆయన ఎప్పుడూ ఐ లవ్‌ యూ చెప్పరు

అందుకే మగాళ్లు తరచు మోసాలకు..

ఆమె బార్‌ గాళ్‌గా పనిచేయటం చూడలేక..

చావు కూడా ఆ ప్రేమికుల్ని విడదీయలేకపోయింది..

తను ఎంతలా ప్రేమించిందంటే నా కోసం..

నీలాంటి వాడు దొరికితే అస్సలు వదులుకోను

నా బ్యాడ్‌లక్‌ ఫేర్‌వెల్‌ క్యాన్సిల్‌ అయ్యింది

ఐ లవ్యూ షాన్. ఐ నీడ్ యూ. నువ్వు లేకుండా..

అలాంటి గీతాలే గాయపడిన మనసుకు...

ప్రేమ ఓడింది... నేను గెలిచాను!

అతడో హంతకుడు.. ఆమె ఓ రచయిత్రి

మీ పార్ట్‌నర్‌ సెల్‌ఫోన్‌ చెక్‌ చేస్తున్నారా?..

ఆ విషయం తెలిసి షాక్‌ అయ్యాను!

అతడి సమాధి ఓ చివరి ప్రేమలేఖలా..

అది అన్ని వేళలా మంచిది కాదు

నేను ప్రేమిస్తున్న అమ్మాయే తన ప్రేమని..

‘ఆరేడుగురితో డేటింగ్‌.. ఇంకో లైఫ్‌ కావాలి’