చెమటతో ఎంతో ఆరోగ్యం..

14 Jun, 2020 18:41 IST|Sakshi

న్యూఢిల్లీ: సాధారణంగా మనిషికి అధికంగా చెమట పట్టిందంటే ఆరోగ్యంగా ఉన్నారని అంటారు. కానీ ప్రస్తుత సమాజంలో అధికంగా చెమట వచ్చినప్పటికి అనారోగ్యానికి కారణమని కొందరు అపోహలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకీ మనిషికి చెమట పట్టడం మంచిదా? కాదా?. మరి ఇందుకు సంబంధించిన వాస్తవాలను విశ్లేషిద్దాం.. మనిషి ఆరోగ్యానికి చెమట ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో విపరీతమైన వేడితో చెమట సాధారణం కంటే అధికంగా వస్తుంది. వేసవిలో శ్వేధం అధికంగా స్రవించడం వల్ల శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ద్రవాలను కోల్పోతాం. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు విపరీతమైన వేడి, తేమ (గాలిలో ఆవిరి) వల్ల జుట్టు పొడిబారుతోంది. ఒత్తయిన జట్టును సొంతం చేసుకోవాలంటే నిత్యం నీటితో శుభ్రం చేసుకోవాలి. కానీ కొన్ని కాస్మోటిక్‌ కంపెనీలు చమట పట్టడాన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. అయితే కంపెనీల ప్రకటనలను చర్మ వ్యాధి నిపుణులు కొట్టిపారేశారు.  

ఆరోగ్యానికి చెమట ఎంతో మేలు చేకూరుతుందని వైద్యులు తెలిపారు. మనిషికి చెమట రాకపోతే శరీరంలో ఉన్న మలినాలు చర్మం నుంచి బయటకు వెళ్లవని వైద్యులు పేర్కొంటారు. మనిషి చాలినంత చెమటను బయటకు స్రవించడం ద్వారా మొఖం మీద మొటిమలు రాకుండా చెమట గ్రంథులు నిరోధిస్తాయని అంటున్నారు. చర్మ సంరక్షణకు నిరంతర వ్యాయామంతో పాటు సమతుల ఆహారం (balanced diet) ఎంతో ముఖ్యం. జిమ్‌లో నిరంతరం వర్క్‌వుట్‌ చేసే వారి చర్మం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో చెమట కీలక పాత్ర పోషిస్తుంది.

శరీరానికి కావాలసిన చెమట స్రవించడం వల్ల మనిషికి దాహం వేస్తుంది. దీంతో దాహం తీరడానికి ఎక్కువగా నీళ్లను తీసుకుంటారు. శరీరానికి కావాల్సిన నీరు తీసుకోవడం వల్ల చర్మ సంరక్షణకు  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మం నుంచి చెమట స్రవించడం వల్ల శరీరానికి ఉపయోగపడే ఖనిజాలు విడుదలవుతాయని.. ఇవి పొడిబారిన చర్మాన్ని, యూరియా, యూరిక్‌ యాసిడ్‌, చెడు బ్యాక్టీరియా,అలర్జీ సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడతాయి. వ్యాయాయం పూర్తయిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలని.. ముఖ్యంగా మెడ ప్రాంతంపై చెమట ఎక్కువ వస్తుంది కాబట్టి నిత్యం శుభ్రం చేసుకోవాలని, శరీరాన్ని నిత్యం సున్నితంగా శుభ్రం చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు